Site icon NTV Telugu

ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా టీమిండియా మహిళా క్రికెటర్

టీమిండియా స్టార్ మహిళా క్రికెటర్‌ స్మృతి మంధాన మరోసారి సత్తా చాటింది. 2021లో అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలోనూ అద్భుత ప్రదర్శనతో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా స్మృతి మంధాన నిలిచింది. ఈ విషయాన్ని ఐసీసీ స్వయంగా వెల్లడించింది. ఈ అవార్డు రేసులో ఇంగ్లండ్ ప్లేయర్ టామీ బీమాంట్, దక్షిణాఫ్రికా ప్లేయర్ లిజెల్లె లీ, ఐర్లాండ్ క్రికెటర్ గాబీ లూయీస్ నిలిచినా.. స్మృతి మంధాన వారిని వెనక్కి నెట్టి తాను విజేతగా ఎంపికైంది.

Read Also: ఐపీఎల్-15: కొత్త ఫ్రాంచైజీ లక్నో జట్టు పేరు ఖరారు

2021లో అన్ని ఫార్మాట్లలో కలిపి 22 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఓపెనర్‌ స్మృతి మంధాన 38 సగటుతో 855 పరుగులు చేసింది. ఇందులో ఒక సెంచరీ, 5 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. కాగా 2018లోనూ స్మృతి మంధాన ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది. అప్పుడు వన్డేల్లోనూ మేటి మహిళా క్రికెటర్‌గా నిలిచింది. స్మృతి మంధాన కంటే ముందు 2007లో జులన్ గోస్వామి మాత్రమే మేటి మహిళా క్రికెటర్ పురస్కారాన్ని అందుకుంది. అటు 2021లో ఉత్తమ వన్డే క్రికెటర్‌గా దక్షిణాఫ్రికా క్రికెటర్ లిజెల్లె లీ అవార్డును సొంతం చేసుకుంది.

Exit mobile version