Site icon NTV Telugu

మిథాలీ స్థానంలో స్మృతీ మంధానను కెప్టెన్‌గా నియమించాలి

మహిళల క్రికెట్‌ జట్టులో మిథాలీ రాజ్‌ తర్వాత కెప్టెన్‌ ఎవ్వరూ అనే చర్చ మొదలైంది. మిథాలీ స్థానంలో స్మృతీ మంధానను నియమించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. వచ్చే ఏడాది న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే ప్రపంచ కప్‌ అనంతరం మిథాలీ రాజ్‌ రిటైర్‌మెంట్‌ కానుంది. ఈ నేపథ్యంలో టెస్టులు, వన్డేల్లో మిథాలీ వారసురాలిగా స్మృతీకి ఛాన్స్‌ ఇవ్వాలని మాజీ కెప్టెన్‌ శాంతా రంగస్వామి అభిప్రాయపడింది. టీ20జట్టుకు హర్మన్‌ప్రీత్‌కౌర్‌ నాయకత్వం వహిస్తుంది.

కానీ ఆమె బ్యాటింగ్‌లో రాణించలేకపోతుందన్నారు. దీంతో మిథాలీ వారసురాలిగా హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ను ఎంపిక చేస్తారా అనేది ప్రశ్నే. మరోవైపు మంధాన ప్రపంచ అత్యుత్తమ బ్యాటర్‌గా రాణిస్తుంది. అంతేకాకుండా ఓపెనర్‌గా స్మృతీ మంధాన బెస్ట్ ఛాయిస్‌అని, టీం తరపున అద్భుతంగా రాణిస్తుందని అందువల్ల కెప్టెన్సీ అవకాశాన్ని స్మృతీ మంధానకు ఇవ్వాలని బీసీసీఐ అపెక్స్‌ కమిటీ సభ్యురాలైన శాంతా రంగస్వామి పేర్కొన్నారు.

Exit mobile version