Site icon NTV Telugu

IPL 2023: గుజరాత్ సారథి మార్పు.. కెప్టెన్ గా శుభ్ మన్ గిల్

Shubman Gill

Shubman Gill

మరో 8 రోజుల్లో ప్రారంభంకానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2023 ఎడిషన్ లో భాగంగా హార్థిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్.. డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాలో బరిలోకి దిగనుంది. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్యే జరుగనుంది. అయితే ఈ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ కు ముందే గుజరాత్ టైటాన్స్ టీమ్ సారథి విక్రమ్ సోలంకి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టులో ఓపెనర్ గా ఉన్న టీమిండియా బ్యాటర్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ భవిష్యత్ లో గుజరాత్ కెప్టెన్ గా ఎంపికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఐపీఎల్ -16 ఆరంభానికి ముందే ఈ మార్పు ఉండే అవకాశం ఉందని విక్రమ్ సోలంకి వెల్లడించినట్లు టాక్.

Also Read : Farooq Abdullah: రాముడు హిందువులకు మాత్రమే దేవుడు కాదు.. అందరివాడు..

శుభ్ మన్ గిల్ లో నాయకత్వ లక్షణఆలు పుష్కలంగా ఉన్నాయని విక్రమ్ సోలంకే వీడియో కాన్ఫరేన్స్ మీటింగ్ లో వెల్లడించినట్లు తెలుస్తోంది. వృతి పట్ల అతడికున్న నిబద్దత కూడి గిల్ నాయకత్వ లక్షణాలను పెంపొందించుకునే విధంగా ఉన్నాయన్నారు. గిల్ సమీప భవిష్యత్ లో గుజరాత్ కు సారథిగా వ్యవహరిస్తాడా.. అంటే అవుననే చెప్పగలను అంటు విక్రమ్ సోలంకే తెలిపారు. అయితే ఈ విషయంలో ఇంతవరకూ అధికారికంగా ఏ నిర్ణయమూ తీసుకోలేదు.. ప్రస్తుతం హార్థిక్ పాండ్యా జట్టును విజయవంతంగా నడిపిస్తున్నాడు.. గిల్ చాలా టాలెంటెడ్ క్రికెటర్.. జట్టుకు సంబంధించిన కీలక నిర్ణయాల్లో మేం అతడి అభిప్రాయాలను గౌరవిస్తాం అని విక్రమ్ సోలంకి తెలిపాడు.

Also Read : Illicit Relationship : నా భార్య డ్రైవర్‎తో పారిపోయింది.. స్టేషన్లో ఫిర్యాదు

గత సీజన్ లో గిల్.. గుజరాత్ తరపున 16 మ్యాచ్ లు ఆడి 132.32 సగటుతో 432 పరుగులు చేశాడు. గుజరాత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో హార్థిక్ పాండ్య తర్వాత స్థానం గిల్ దే.. ఇక ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన తర్వాత గిల్ పై భారీ అంచనాలున్నాయి. కాగా గుజరాత్ తరపున ఆడుతున్న మహ్మద్ షమీ వర్క్ లోడ్ మేనేజ్మెంట్ గురించి అడిగిన ప్రశ్నపై సోలంకి సమాధానంగా షమీ మా టీమ్ లో కీలక ప్లేయర్ అన్నారు. గతేడాది మా టీమ్ తరపున అద్భుతంగా రాణించాడు. ఫాస్ట్ బౌలర్లను జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు. ఈ విషయంలో మేం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.. అని తెలిపాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత నేరుగా ఐపీఎల్ ఆడుతున్న షమీ.. అది ముగిశాక ఇంగ్లండ్ వేదికగా జరుగబోయే వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఆడనున్నాడు. గుజరాత్ టీమ్ నుంచి శుభ్ మన్ గిల్ కూడా భారత జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ ఇద్దరి విషయంలో గుజరాత్.. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ ఎలా నిర్వహిస్తుందన్నది వేచి చూడాలి..

Exit mobile version