Shubman Gill: నేను ఇప్పటివరకు గుర్తుండిపోయే క్యాచ్ అందుకోలేదు.. చాలా సంతోషంగా ఉంది!
- శుభ్‌మన్ గిల్ అద్భుత ఫీల్డింగ్
- సోషల్ మీడియాలో వైరల్‌గా గిల్ క్యాచ్
- చాలా సంతోషంగా ఉందన్న గిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shubman Gill on Stunning Slip Catch: భారత్-అఫ్గానిస్థాన్ మధ్య ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన బ్యాటింగ్‌తోనే కాకుండా అద్భుతమైన ఫీల్డింగ్‌తో కూడా అందరి దృష్టిని ఆకర్షించాడు. అఫ్గాన్ ఇన్నింగ్స్ సందర్భంగా గిల్ పట్టిన అద్భుత క్యాచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్ అభిమానులు దీనిని ఇప్పటికే ‘క్యాచ్ ఆఫ్ ది ఇయర్’గా అభివర్ణిస్తున్నారు. తాను పట్టిన అద్భుత క్యాచ్‌పై గిల్ స్వయంగా స్పందించాడు.
వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ బ్యాటర్లు భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. 22వ ఓవర్లో అరంగేట్ర స్పిన్నర్ హర్ష్ దూబే బౌలింగ్‌లో అల్లా ఘజన్ఫర్ భారీ షాట్ ఆడాడు. బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని ఫస్ట్ స్లిప్ వైపు దూసుకెళ్లింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న శుభ్‌మన్ గిల్ గాల్లోకి డైవ్ చేస్తూ తన ఎడమ చేత్తో అసాధారణ క్యాచ్ అందుకున్నాడు. గిల్ కుడిచేతి బ్యాటర్ కావడంతో ఎడమచేత్తో పట్టిన ఈ క్యాచ్ మరింత ప్రత్యేకంగా నిలిచింది. ఈ స్టన్నింగ్ క్యాచ్‌ను చూసి మైదానంలోని ఆటగాళ్లు, అభిమానులు ఆశ్చర్యపోయారు. ఘజన్ఫర్ డకౌట్‌గా వెనుదిరగగా.. ఆ మూమెంట్ మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది.
Also Read
- Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
- Shubman Gill: "డోంట్ వర్రీ".. రోహిత్ రనౌట్ వివాదంపై శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Iran vs America: అప్పుడు గులాబీలు.. ఇప్పుడు బాంబులు.. ప్రపంచాన్ని హత్తుకున్న ఈ ఫొటో వెనుక ఉన్న కథ ఇదే!
- IND W vs PAK W: పాకిస్థాన్ ప్లేయర్లతో కరచాలనం చేస్తారా? భారత్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ షాకింగ్ కామెంట్స్!
శుభ్‌మన్ గిల్ పట్టిన క్యాచ్ వీడియో క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. క్రికెట్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు అతడి ఫీల్డింగ్ నైపుణ్యాన్ని ప్రశంసిస్తున్నారు. కొందరు దీనిని ఈ ఏడాది అత్యుత్తమ క్యాచ్‌గా అభివర్ణిస్తుండగా.. మరికొందరు స్లిప్‌లో పట్టిన గొప్ప క్యాచ్‌ల జాబితాలో దీనికి ప్రత్యేక స్థానం ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. మ్యాచ్ అనంతరం తన క్యాచ్ గురించి మాట్లాడిన గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్లిప్ ఫీల్డింగ్‌పై తాను చాలా రోజులుగా ప్రత్యేకంగా సాధన చేస్తున్నానని తెలిపాడు. ‘నేను ఆ క్యాచ్‌ను బాగా అందుకున్నాను. స్లిప్‌లో క్యాచ్‌లు పట్టేందుకు ప్రాక్టీస్ చేస్తున్నాను. మ్యాచ్‌కు ముందు మా ఫీల్డింగ్ కోచ్ టీ. దిలీప్‌తో మాట్లాడుతూ.. ఇప్పటివరకు భారత జట్టు తరఫున గుర్తుండిపోయే అద్భుత క్యాచ్ నేను పట్టలేదని చెప్పాను. ఈరోజు ఆ క్యాచ్ పట్టడం చాలా సంతోషంగా ఉంది’ అని గిల్ పేర్కొన్నాడు.
ఫీల్డింగ్‌లో మెరిసిన శుభ్‌మన్ గిల్.. బ్యాటింగ్‌లోనూ అదరగొట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 195 పరుగుల లక్ష్య ఛేదనలో అజేయంగా 84 పరుగులు చేసి భారత్‌కు 7 వికెట్ల తేడాతో విజయం అందించాడు. 66 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో చెలరేగిన గిల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును సొంతం చేసుకున్నాడు. అద్భుత క్యాచ్‌తో పాటు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన గిల్.. ఒకే మ్యాచ్‌లో తన ఆల్‌రౌండ్ ప్రతిభ చూపించి అభిమానుల ప్రశంసలు అందుకున్నాడు.
𝐒𝐔𝐏𝐄𝐑-𝐌𝐀𝐍 𝐆𝐈𝐋𝐋! 🦸♂️🔥
Captain #ShubmanGill pulls off a stunner in the field as #AFG loose their 8th wicket 👏#INDvAFG | 1st ODI | LIVE NOW 👉 https://t.co/wBah2REzpB pic.twitter.com/rTdzyAacl3
— Star Sports (@StarSportsIndia) June 13, 2026
తాజావార్తలు
-
Shubman Gill: నేను ఇప్పటివరకు గుర్తుండిపోయే క్యాచ్ అందుకోలేదు.. చాలా సంతోషంగా ఉంది!
-
Best Electric Scooters: ఓలా, హీరో, టీవీఎస్.. హైయెస్ట్ స్పీడ్ గల ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది? కేవలం రూ.44,990 నుంచే ప్రారంభం!
-
Explainer: ప్రేమిస్తే జైలుకు..? శృంగారంలో పరస్పర అంగీకారం ఉన్నా కూడా రే*ప్ కేసు అవుతుందా?
-
Power Star : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. స్టార్ దర్శకుడితో సినిమా డౌటే
-
Bollywood Gossip : నేను ‘గే’ కాదు… హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!