NTV Telugu Site icon

Gujarat Titans: ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు కీలక ఆటగాడు గుడ్‌బై..!!

Shubman Gill

Shubman Gill

Gujarat Titans: ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే సీజన్ ఐపీఎల్‌ సందర్భంగా గుజరాత్‌ జట్టు నుంచి శుభ్‌మన్ గిల్ తప్పుకున్నాడు. ఈ విషయాన్ని గుజరాత్ టైటాన్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. శుభ్‌మన్ గిల్ భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించింది. తమ జట్టుతో కొనసాగిన అతని ప్రయాణం అద్భుతమని ప్రశంసించింది. ‘శుభ్‌మన్ నీ ప్రయాణం గుర్తించుకోదగినది. నీ భవిష్యత్ మరింత అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాం’అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు శుభ్‌‌మన్‌ సైతం లవ్ యూ అనే ఏమోజీతో బదులిచ్చాడు.

Read Also: Virat Kohli: కొత్త లుక్‌లో విరాట్ కోహ్లీ.. సోషల్ మీడియాలో వైరల్

కాగా ట్రేడింగ్ ద్వారా శుభ్‌మన్ గిల్ ముంబై ఇండియన్స్‌ జట్టుకు వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీని కోసం గుజరాత్ టైటాన్స్ యాజమాన్యంతో ముఖేష్ అంబానీ లోపాయికార ఒప్పందం చేసుకున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే చాలా మంది అభిమానులు గుజరాత్‌ జట్టును శుభ్‌మన్ వీడుతున్నాడంటే నమ్మడం లేదు. ఇది ఫ్రాంక్ అని కొందరు కొట్టిపారేస్తున్నారు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలంలో రూ.8 కోట్ల భారీ ధరకు శుభ్‌మన్ గిల్‌ను గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. 16 మ్యాచ్‌ల్లో 132.33 స్ట్రైక్‌రేట్‌తో గిల్ 483 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలున్నాయి. అత్యధిక స్కోరు 96. ముఖ్యంగా గుజరాత్ టైటిల్ విన్నర్ కావడంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు గిల్ కూడా ముఖ్య పాత్ర పోషించాడు.

Show comments