Shubman Gill: కోచ్ రికార్డునే బ్రేక్ చేసిన శిష్యుడు.. సెంచరీల్లో శుభమన్ గిల్ సరికొత్త రికార్డు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శుభమన్ గిల్ కెప్టెన్‌గా అఫ్గానిస్తాన్‌తో లక్నోలోని ఇటానా స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో అద్భుతమైన బ్యాటింగ్‌తో చెలరేగారు. కేవలం 110 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 154 పరుగులు చేశారు. వన్డేల్లో కెప్టెన్‌గా గిల్‌కు ఇది తొలి శతకం కాగా, మొత్తంగా వన్డేల్లో 9వ శతకం. అంతర్జాతీయ క్రికెట్లో ఇది ఆయనకు 21వ సెంచరీ. ఇందులో 11 టెస్టులు, 1 టీ20 శతకం ఉన్నాయి. భారత్ తరఫున ఇప్పటివరకు 140 మ్యాచ్‌లు ఆడిన గిల్, ఈ ఇన్నింగ్స్‌తో ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (20 సెంచరీలు) రికార్డును అధిగమించి, భారత్ తరఫున అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో 12వ స్థానానికి చేరుకున్నారు. భారత్ తరఫున సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ 85 శతకాలతో రెండో స్థానంలో ఉన్నారు.
ఈ మ్యాచ్‌లో సాధించిన 154 పరుగులతో వన్డే క్రికెట్లో అత్యధిక సార్లు 150 కంటే ఎక్కువ పరుగులు చేసిన భారతీయ బ్యాటర్ల క్లబ్లో గిల్ చేరారు. వన్డేల్లో ఆయన 150+ పరుగులు చేయడం ఇది రెండోసారి. దీనితో వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, గౌతమ్ గంభీర్ల సరసన నిలిచారు. ఈ జాబితాలో రోహిత్ శర్మ 8 సార్లతో టాప్‌లో ఉండగా.. సచిన్, కోహ్లీ చెరో 5 సార్లు ఈ ఘనత సాధించారు. కేవలం 26 ఏళ్ల వయసులోనే భారత్ తరఫున అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాళ్లలో గిల్ 9 సెంచరీలతో (63 ఇన్నింగ్స్‌ల్లో) నాలుగో స్థానంలో నిలిచారు. ఈ వయసులో సచిన్ 25, కోహ్లీ 23, యువరాజ్ సింగ్ 10 సెంచరీలు చేశారు.
Also Read
- PV Sindhu : ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పి.వి.సింధు.. మరో సూపర్ 750 టైటిల్‌పై కన్ను
- Viral : స్టంప్ మైక్‌లో రికార్డైన తిలక్, నితీష్ తెలుగు ముచ్చట్లు.. తెలుగు కుర్రాళ్ల మాటలు లీక్
- India vs New Zealand: కివీస్ గడ్డపై తెలుగోళ్ల విధ్వంసం.. భారత్ ఖాతాలో మరో రికార్డ్ విక్టరీ!
- India vs New Zealand T20: చివరి ఓవర్లో నరాలు తెగే ఉత్కంఠ.. న్యూజిలాండ్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ!
భారత్ తరఫున అత్యధిక అంతర్జాతీయ శతకాలు బాదిన వారిలో సచిన్, కోహ్లీ తర్వాత రాహుల్ ద్రవిడ్ (48), గంగూలీ (38), సెహ్వాగ్ (38), సునీల్ గవాస్కర్ (35), మహ్మద్ అజహరుద్దీన్ (29), శిఖర్ ధావన్ (24), వీవీఎస్ లక్ష్మణ్ (23), కేఎల్ రాహుల్ (22) ముందు వరుసలో ఉన్నారు. గిల్ సాధించిన ఈ తాజా సెంచరీ ఆయన కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచింది.
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!