Shoaib Akhtar Reflies to Mohammad Shami “Karma” Tweet: టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్, పాకిస్తాన్ పై ఘన విజయం సాధించి ఛాంపియన్స్ గా నిలిచింది. వరల్డ్ కప్ పై భారీ ఆశలు పెట్టుకున్న పాకిస్తాన్ కు నిరాశే ఎదురైంది. ఇదిలా ఉంటే ఈ పరాజయం తర్వాత పాకిస్తాన్ క్రికెట్ టీమును, పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లను ఇండియన్ నెటిజెన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇండియన్ వెటరన్ బౌలర్ మహ్మద్ షమీ, అక్తర్ మధ్య ట్విట్టర్ వార్ జరుగుతోంది. పాకిస్తాన్ ఓడిపోయిన తర్వాత హృదయం పగిలిన ఎమోజీని ట్వీట్ చేశాడు. దీనికి రిప్లై ఇస్తూ మహ్మద్ షమీ.. ‘‘సారీ బ్రదర్.. కర్మ అంటే ఇదే’’ అంటూ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే తాజాగా అక్తర్, మహ్మద్ షమీ ట్వీట్ కు సమాధానం ఇచ్చారు. భారత్ ప్రఖ్యాత కామెంటేటర్ హర్షా భోగ్లే ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ‘‘పాకిస్తాన్ జట్టుకు క్రెడిట్..కొన్ని జట్లు 137 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకున్నాయి. పాకిస్తాన్ కూడా అదే చేసింది. బెస్ట్ బౌలింగ్ టీమ్’’ అంటూ ట్వీట్ చేశారు హర్షా భోగ్లే. షమీకి సమాధానం ఇస్తూ.. ‘‘సెన్సిబుల్ ట్వీట్’’ అంటూ అక్తర్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
ఆదివారం మెల్బోర్న్ లో జరిగిన ఫైనల్స్ లో ఇంగ్లాండ్, పాకిస్తాన్ పై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 137/8 రన్స్ చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లు సామ్ కర్రన్, ఆదిల్ రషీద్ పాకిస్తాన్ బ్యాటర్లకు కళ్లెం వేశారు. ఆ తరువాత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ 19 ఓవర్లలోనే 138 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. రెండోసారి ప్రపంచ కప్ సొంతం చేసుకుంది. బెన్ స్టోక్స్ అద్భుత ఇన్నింగ్ తో ఇంగ్లాండ్ కు మరో ప్రపంచకప్ అందించారు.
https://twitter.com/shoaib100mph/status/1591787400019181577
