బుధవారం విశాఖపట్నంలో న్యూజిలాండ్‌తో జరిగిన జరిగిన నాలుగో టీ20లో టీమిండియా ఆల్‌రౌండర్ శివమ్ దూబే శివాలెత్తాడు. 23 బంతుల్లోనే 65 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏడు సిక్సర్లు, మూడు ఫోర్లు ఉన్నాయి. న్యూజిలాండ్ స్పిన్నర్ ఇష్ సోధీ వేసిన ఓవర్‌లో ఏకంగా 28 రన్స్ పిండుకున్నాడు. కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తిచేసి.. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో వేగవంతమైన అర్ధ సెంచరీ చేసిన మూడో భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లో నిలిచాడు. ప్రస్తుతం దూబే పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక మ్యాచ్ అనంతరం దూబే తన ఇన్నింగ్స్‌పై మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఇప్పుడు స్మార్ట్ ప్లేయర్ అని పేర్కొన్నాడు. తాను కేవలం పవర్ హిట్టింగ్‌తోనే కాకుండా.. మెరుగైన ఆలోచనా విధానంతో కూడా ఆడుతున్నానని స్పష్టం చేశాడు.
మ్యాచ్ అనంతరం శివమ్ దూబే మాట్లాడుతూ… ‘ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా నా కఠిన శ్రమకు దక్కిన ఫలితం. వరుసగా మ్యాచ్‌లు ఆడుతుండటంతో నా మైండ్‌సెట్ పూర్తిగా మారింది. బౌలర్ ఎలాంటి బంతులు వేస్తాడో ముందే అర్థం చేసుకోగలుగుతున్నాను. కఠిన పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయడంతో నా ఆట మరింత మెరుగైంది. బౌలింగ్ కూడా నా ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ మ్యాచ్‌లో బౌలింగ్ చేయకపోయినా.. ఇంతకుముందు కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాకు బౌలింగ్ చేసే అవకాశాలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. బౌలింగ్ చేస్తే ఆటపై అవగాహన పెరుగుతుంది. మరింత స్మార్ట్ ప్లేయర్ అవుతారు’ అని చెప్పాడు.
Also Read: Shreyas-Gambhir Controversy: శ్రేయస్ అయ్యర్-గౌతమ్ గంభీర్ మధ్య విభేదాలా?.. అంతా గౌతీ చేతుల్లోనే?
అనుభవమే తన ఆటను పూర్తిగా మార్చిందని శివమ్ దూబే అంగీకరించాడు. ‘అనుభవం కూడా నాకు ఉపయోగపడుతోంది. ఇప్పుడు నేను సరైన దిశలో నడుస్తున్నా. ప్రతి ప్లేయర్ తనను తాను అప్‌గ్రేడ్ చేసుకోవాలి. నేను గతంలో ఉన్నట్లు ఇప్పుడు లేను. ప్రతి మ్యాచ్‌లో కాస్త బెటర్‌గా, కొంచెం స్మార్ట్‌గా మారడానికి ప్రయత్నిస్తున్నా. రికార్డులపై నేను దృష్టి పెట్టలేదు. ప్రతి బంతిపై మాత్రమే ఫోకస్ పెట్టాను. 15 బంతుల్లో ఫిఫ్టీ చేయాలనే ఆలోచన నాకు లేదు. ఇష్ సోధీ ఒత్తిడిలో ఉన్నాడని అర్ధమైంది. తప్పకుండా ఓ చెత్త బంతి వేస్తాడని అనుకున్నా. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఆధిపత్యం చెలాయించాలని డిసైడ్ అయి అలా ఆడాను’ అని దూబే తన ఆట గురించి వివరించాడు. ఈ ఇన్నింగ్స్‌తో టీ20 వరల్డ్‌కప్ 2026 ముందు జాగ్రత్త అంటూ ప్రత్యర్థి జట్లకు దూబే సందేశం పంపించాడు.
