కోడి మాంసం ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. మార్కెట్‌లో కోడి మాంసం ధర పరుగులు పెట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రేట్ పెరగటంతో మాంసాహార ప్రియులు ఆందోళనకు గురి అవుతున్నారు. పెరిగిన ధరను చూసి మాంసంప్రియులు జేబులు పట్టుకుంటున్నారు. సహజంగానే వేసవిలో కోడి మాంసం ధరలు ఎక్కువగా ఉంటాయి. ఈ సీజన్‌లో కోళ్లకు సోకే వ్యాధులతో కోళ్లు మృతి చెందటం కారణంగా మాంసం ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో ధరలు పెరుగుతున్నాయి.
Also Read : Siddaramaiah: 2024లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు..
అయితే ఈసారి పెరిగిన కోడి ధరలతో నాన్ వెజిటేరియన్లు ఏమి కొంటాం.. ఏమి తింటాం అని నిరాశ వ్యక్తం చేస్తున్నారు. గత వారంలో కిలో బాయిలర్ రూ.200 నుంచి రూ.210 వరకు ధర పలికింది. ఫారమ్ కోడి రూ.150 నుంచి రూ.170 వరకు ఉంది. అలాంటిది ఈ వారం బాయిలెర్ మాంసం కిలో ధర రూ.280 నుంచి రూ.285 పలుకుతుంది. దీంతో ఫారం కోడి కిలో మాంసం 200 రూపాయలు దాటింది.
Also Read : Revanth Reddy: బీఆర్‌ఎస్ 25, ఎంఐఎం 7, బీజేపీ 9 లోపే.. మిగిలిన సీట్లు కాంగ్రెస్ వే
ఈ వేసవికాలంలో సాధ్యమైనంత వరకు కోళ్ల పెంపకం తక్కువగా ఉంటుంది. ప్రసుత్తం రాష్ట్రవ్యాప్తంగా కిలో నుంచి కిలోంపావు కోళ్లు మాత్రమే మార్కెట్‌లో అందుబాటులోకి వస్తున్నాయని చికెన్ దుకాణదారులు చెప్తున్నారు. వినియోగదారులు చిన్న కోళ్లు కొనటానికి ఆసక్తి చూపక పోవంటతో ఎక్కువ బరువు ఉన్న కోళ్లను దిగుమతి చేసుకుంటున్నామన్నారు. ప్రధానంగా హైదరాబాద్, గుంటూరు, పశ్చిమగోదావరి, భీమవరం ప్రాంతాల నుంచి కోళ్లను కొనుగోలు చేస్తుండటంతో మాంసం ధరలకు రెక్కలు వచ్చాయి. కోడి మాంసంతో పాటు కోడి గుడ్డు ధర కూడా అదే దారిలో నడుస్తుంది. పది రోజుల క్రితం రూ.4 లోపు పలికిన గుడ్డు ధర ఈ వారం రూ.5 కు చేరింది.