NTV Telugu Site icon

వీరే టాప్ 5 బ్యాటర్లు అంటున్న వార్న్.. కోహ్లీ స్థానం ఏంటంటే..?

క్రికెట్ చరిత్రలో టాప్ స్పిన్నర్లు ఎవరు అనే చర్చలో తప్పకుండ వచ్చే పేరు ఆసీస్ మాజీ స్పిన్నర్ షేన్ వార్న్. అయితే టెస్ట్ క్రికెట్ లో 708 వికెట్లు తీసిన వార్న్ తాజాగా ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ లో ఉన్న టాప్ 5 బ్యాటర్లు వీరే అంటూ ప్రకటించాడు. అయితే వార్న్ ప్రకటించిన జాబితాలో మొదటి స్థానంలో ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ ఉన్నాడు. అతను గత కొంత కాలంగా అన్ని రకాల బౌలర్లను ఎందుకుంటూ రాణిస్తున్నాడు అని చెప్పాడు.

అలాగే ఒక్కే ఏడాదిలో టెస్ట్ లో 6 శతకాలు చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ లో రెండో స్థానంలో ఉంచిన వార్న్… అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్న కేన్ విలియమ్సన్ ను మూడో స్థానంలో పెట్టాడు. అలాగే భారత టెస్ట్ కెప్టెన్ ను నాలుగో స్థానంలో ఉంచిన ఆసీస్ మాజీ స్పిన్నర్.. అతను కొంత కాలంగా రాణించలేకపోతున్నాడు అని చెప్పాడు. ఇక చివరగా 5వ స్థానంలో మరో ఆసీస్ ఆటగాడు మార్నస్ లాబుస్చాగ్నే ను ఉంచాడు.