Site icon NTV Telugu

T20 WorldCup: బుమ్రా స్థానంలో ఆస్ట్రేలియా వెళ్లేది అతడేనా?

Shami

Shami

T20 WorldCup: ఈనెల 23 నుంచి ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం టీమిండియా ఆటగాళ్లు ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్నారు. రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలోని మొత్తం 14మంది ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ సభ్యులు రెండ్రోజుల క్రితమే విమానంలో ఆసీస్ వెళ్లారు. అయితే గాయం కారణంగా టీమిండియా స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు. దీంతో అతడి స్థానంలో బీసీసీఐ ఎవరినీ నియమించలేదు. ఈ నేపథ్యంలో బుమ్రా స్థానంలో ఎంపికయ్యే ఆటగాడు ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం పీటీఐ అందిస్తున్న సమాచారం ప్రకారం బుమ్రా స్థానంలో మహ్మద్ షమీని సెలక్టర్లు జట్టులోకి తీసుకోబోతున్నారని తెలుస్తోంది.

Read Also: Aishwarya – Dhanush: అవన్నీ ఫేక్ వార్తలే.. కలవట్లేదు

కానీ కరోనా నుంచి కోలుకున్నాక ప్రపంచకప్‌కు ముందు షమీ ఒక్క మ్యాచ్ కూడా టీమిండియా తరఫున ఆడలేదు. 2021 నవంబర్ నుంచి ఒక్క అంతర్జాతీయ టీ20 కూడా షమీ ఆడలేదు. ఈ దశలో టీమిండియా చాలా మంది యువ పేసర్లతో ప్రయోగాలు చేసింది. టీ20 ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌లో షమీ ఆడతాడనుకుంటే అది కూడా జరగలేదు. దీంతో అతడు టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక కావడం కష్టమేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీపక్ చాహర్ లేదా సిరాజ్‌లలో ఒకరిని బుమ్రా స్థానంలో ఆసీస్ పంపిస్తారని పలువురు విశ్లేషించారు. కానీ అనుభవం ఉన్న షమీపైనే సెలక్టర్లు విశ్వాసం ఉంచినట్లు తెలుస్తోంది. కాగా ఈనెల 23న పాకిస్థాన్‌తో భారత్ తన టైటిల్ వేటను షురూ చేయనుంది.

Exit mobile version