Site icon NTV Telugu

Shahid Afrid: పాకిస్తాన్ భారత్ మ్యాచ్ బాయ్‌కాట్‌పై అఫ్రిది కీలక వ్యాఖ్యలు..

Shahid Afridi

Shahid Afridi

Shahid Afrid: మాజీ పాకిస్తాన్ కెప్టెన్, లెజండరీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది టీ 20 వరల్డ్ కప్ 2026 వివాదంపై స్పందించారు. భారత్‌లో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. ఫిబ్రవరి 15న కోలంబోలో భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, ఐసీసీ చర్యలకు నిరసనగా భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తున్నట్లు చెప్పింది. భారత్‌లో ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్‌ టోర్నీ నుంచి అవుట్ అయింది. బంగ్లా స్థానంలో స్కాట్లాండ్‌కు అవకాశం ఇచ్చింది. దీనిపై పాక్ అసహనం వ్యక్తం చేస్తోంది.

Read Also: Jowar Khichdi Recipe: ఎప్పుడూ తినే కిచిడి బోర్ కొట్టిందా? అయితే ఈ ప్రోటీన్ రిచ్ ‘జొన్న కిచిడి’ ట్రై చేయండి!

ఇదిలా ఉంటే, దీనిపై షహీద్ అఫ్రిది మాట్లాడుతూ.. క్రీడలు, రాజకీయాలు వేర్వేరుగా ఉండాలని, టీ 20 ప్రపంచ కప్‌లో భారత్‌తో ఆడకూడదన్న పాకిస్తాన్ నిర్ణయంపై విచారం వ్యక్తం చేశారు. అయితే, తన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతు నిలిచాడు. నిష్పక్షపాత చర్యల ద్వారా సమస్యను పరిష్కరించాలని ఐసీసీని కోరారు.

‘‘రాజకీయాలు తలుపులు మూసివేసినప్పుడు క్రికెట్ వాటిని తెరవగలదని నేను ఎప్పుడూ నమ్ముతాను. విచారకరంగా, పాకిస్తాన్ #T20WorldCupలో భారత్‌తో ఆడదు, కానీ నేను నా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇస్తున్నాను. ప్రతి క్రికెట్ బోర్డుకు నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా, న్యాయంగా ఉన్నామని ప్రకటనల ద్వారా కాకుండా, నిర్ణయాల ద్వారా నిరూపించుకోవడానికి @ICCకి ఇదే సరైన సమయం’’ అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

Exit mobile version