Site icon NTV Telugu

వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు భారతజట్టు ఇదే..!!

స్వదేశంలో వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు సెలక్టర్లు భారత జట్టును ప్రకటించారు. రెండు ఫార్మాట్లకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరించనున్నట్లు వెల్లడించారు. కేఎల్ రాహుల్ రెండో వన్డే నుంచి అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు. ఆల్‌రౌండర్ జడేజా ప్రస్తుతం మోకాలి గాయం నుంచి కోలుకుంటున్నాడని.. అందుకే అతడిని సెలక్ట్ చేయడం లేదని పేర్కొన్నారు. మరోవైపు ఈ సిరీస్‌లకు బుమ్రా, షమీలకు విశ్రాంతి ఇస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి ఫిట్‌గా లేని కారణంగా హార్డిక్ పాండ్యాను సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు.

వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, అవేష్ ఖాన్

టీ20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, వెంకటేష్ అయ్యర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, యజువేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్

Exit mobile version