NTV Telugu Site icon

Scott Styris: అతడు ఆల్‌రౌండర్ కాదు, అరకొర ఆటగాడు

Styris On Shardul

Styris On Shardul

Scott Styris Comments On Shardul Thakur: ఎవరైనా ఒక క్రికెటర్ సరిగ్గా ప్రదర్శించకపోతే.. అతనిపై మాజీలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుంటారు. ఆ ఆటగాళ్ల గత ట్రాక్ రికార్డులను చూడకుండా, కేవలం పేలవ పెర్ఫార్మెన్స్ ఆధారంగా.. వాళ్లు ఆటగాళ్లే కాదని, అలాంటి వాళ్లను జట్టులోకే తీసుకోకూడదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. రీసెంట్‌గానే రోహిత్ శర్మపై కృష్ణమచారి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే! అతడు తన పేరుని నోహిట్‌గా మార్చుకోవాలని, తాను ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయితే రోహిత్‌ని జట్టులోకే తీసుకోనని కుండబద్దలు కొట్టాడు. ఇప్పుడు టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌పై న్యూజీలాండ్ మాజీ ఆల్‌రౌండర్, కామెంటేటర్ స్కాట్ స్టైరిస్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. శార్దూల్‌ని ఆల్‌రౌండర్ కాదని, అరకొర ఆటగాడని బాంబ్ పేల్చాడు.

Kauri Darden Richins: భర్తని చంపింది.. అతనిపై పుస్తకం రాసింది.. చివరికి అలా దొరికింది

చెపాక్‌ వేదికగా ఆదివారం సీఎస్‌కే- కేకేఆర్‌ మ్యాచ్‌ ఆరంభానికి ముందు స్టైరిస్‌ మాట్లాడుతూ.. ‘‘శార్దూల్‌ ఠాకూర్‌ అసలు ఒక క్రికెటర్‌లాగే అనిపించడం లేదు. అతడిని ఆల్‌కరౌండర్‌ అనడం కంటే అరకొర ఆటగాడు అని పిలవడం మంచిది’’ అంటూ పేర్కొన్నాడు. అంటే.. ఎప్పుడో ఒకసారి మాత్రమే బాగా రాణిస్తాడని, నిలకడగా ప్రదర్శించట్లేదని అభిప్రాయపడ్డాడు. అవును.. శార్దూల్ ఈ సీజన్‌లో సరిగ్గా ప్రదర్శించలేదన్న మాట వాస్తవమే! 9 ఇన్నింగ్స్‌లో 110 పరుగులు మాత్రమే చేసిన ఇతగాడు, బౌలర్‌గానూ స్థాయికి తగ్గ రాణించలేదు. ఈ సీజన్‌లో 5 వికెట్లే పడగొట్టాడు. కేకేఆర్‌ తనపై వెచ్చించిన రూ.10.75 కోట్లకు అతడు పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నాడు. కానీ.. గతంలో ఇతడు ఎన్నోసార్లు సింగిల్ హ్యాండెడ్‌గానే రాణించిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా.. లీగ్ మ్యాచ్‌ల్లో కన్నా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో శార్దూల్ తన ఆల్‌రౌండర్ ప్రదర్శనతో చాలాసార్లు టీమిండియాను ఆదుకున్నాడు. అందుకే.. అతడ్ని ‘లార్డ్ శార్దూల్’ అని అభిమానులు పిలుచుకుంటుంటారు.

Vaishnav Tej: ‘రుద్ర కాళేశ్వర రెడ్డి’గా మారిన మెగా మేనల్లుడు… మాములుగా లేడుగా

ప్రతి ఆటగాడికీ ఏదో ఒక సమయంలో బ్యాడ్ ఫేజ్ వస్తుంది. హేమాహేమీలు సైతం తంటాలు పడిన సందర్భాలు ఉన్నాయి. ఆమాత్రం దానికే వారిని ఆటగాడు కాదని వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సబబు కాదు. అందుకే.. స్టైరిస్ వ్యాఖ్యలపై క్రీడాభిమానులు మండిపడుతున్నారు. కాగా.. సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే! సీఎస్కే నిర్దేశించిన 145 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ 18.3 ఓవర్లలోనే ఛేధించింది. టాపార్డర్ కుప్పకూలగా.. నితీశ్ రానా, రింకూ సింగ్ అర్ధ శతకాలతో కదం తొక్కి, తమ జట్టుకి విజయం అందించారు.