NTV Telugu Site icon

‘భారత్ బి’ శ్రీలంక పర్యటన ఇదే…

ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడేందుకు భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇదే సయమంలో మరో భారత జట్టు శ్రీలంకలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ వెలువడింది. జులై 5 న లంకకు బయలుదేరనున్న భారత్ బి జట్టు జట్లు మూడు వన్డేలు, మూడు టీ20 ల్లో పోటీ పడనున్నాయి. ఇందులో జులై 13న మొదటి వన్డే మ్యాచ్ అలాగే వరుసగా 16,18 న రెండు, మూడు వన్డేలు జరగనుండగా జూలై 21,23,25వ తేదీల్లో టీ20లు మ్యాచ్ లు జరగనున్నాయి. ప్రధాన జట్టులో చోటు దక్కని ఆటగాళ్లతో కూడిన జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఇప్పటికే ఈ టూర్‌పై బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ క్లారిటీ ఇవ్వగా ఈ జట్టుకి దివాల్ రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు.