FIFA World Cup: ఖతార్‌లో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలో మూడో రోజు పెను సంచలనం నమోదైంది. బలమైన జట్టు అర్జెంటీనాకు షాక్ తగిలింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో అర్జెంటీనా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఫుట్‌బాల్‌లో తిరుగులేని జట్టుగా పేరున్న అర్జెంటీనాను 2-1 తేడాతో సౌదీ అరేబియా ఓడించి పెను సంచలనం నమోదు చేసింది. అర్జెంటీనా తరఫున సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ మాత్రమే గోల్ చేశాడు. ఆట మొదలైన 9వ నిమిషంలో పెనాల్టీ కిక్‌ను సద్వినియోగం చేసుకున్న మెస్సీ గోల్‌గా మలిచాడు. అయితే తొలి హాఫ్‌లో అర్జెంటీనా ఒక గోల్ చేయగా సెకండ్ హాఫ్‌లో సౌదీ అరేబియా రెండు గోల్స్ చేసింది. రెండో హాఫ్ ప్రారంభమైన కాసేపటికే 47వ నిమిషంలో సౌదీ అరేబియా ఆటగాడు అల్ షెహ్రీ గోల్ చేయడంతో మ్యాచ్ 1-1తో సమంగా నిలిచింది.
Read Also: బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి అట్టర్ ప్లాప్ ను అందుకున్న స్టార్ హీరోలు..
ఆ తర్వాత 57వ నిమిషంలో సౌదీ అరేబియా మరో గోల్ చేసి ఆధిపత్యం చెలాయించింది. ఆ జట్టు ఆటగాడు సలీమ్ అల్ దవాసరి అద్భుత రీతిలో గోల్ సాధించడంతో అర్జెంటీనా తెల్లముఖం వేసింది. పటిష్టమైన అర్జెంటీనా డిఫెన్స్‌ను ఛేదించుకుని టాప్ రైట్ కార్నర్ ఎండ్ నుంచి సలీమ్ గోల్ చేయడం విశేషం. అనంతరం అర్జెంటీనా పదే పదే సౌదీ అరేబియా గోల్ పోస్టుపై దాడి చేసినా ఫలితం మాత్రం దక్కలేదు. కాగా స్టార్ ఆటగాడు మెస్సీ తన హయాంలో ఇప్పటివరకు తన జట్టుకు ఒక్క ప్రపంచకప్ కూడా అందించలేకపోయాడు. అటు ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో గత 36 మ్యాచ్‌లలో ఓటమి ఎరుగని అర్జెంటీనాకు సౌదీ అరేబియా లాంటి జట్టు ఓటమి రుచి చూపించింది.
Saudi Arabia beat Argentina. @adidasfootball | #FIFAWorldCup
— FIFA World Cup (@FIFAWorldCup) November 22, 2022
