Sanju Samson Creates Alltime Record: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తాజాగా ఒక అరుదైన ఘనత సాధించాడు. అజింక్యా రహానే పేరిట ఉన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్‌టైమ్ టాప్ రన్ స్కోరర్ రికార్డును అతడు బద్దలుకొట్టాడు. బుధవారం (ఏప్రిల్ 5) పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో42 పరుగులతో చెలరేగిన సంజూ.. తన 3 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఫీట్ నమోదు చేశాడు. రాజస్థాన్ జట్టు తరఫున రహానే 3098 పరుగులు చేయగా.. నిన్నటి మ్యాచ్‌లో చేసిన 42 పరుగులు కలుపుకొని సంజూ 3138 పరుగులు సాధించాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో సంజూ, అజింక్యా వరుసగా మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. వారి తర్వాత షేన్ వాట్సన్ (2474), జోస్ బట్లర్ (2377) ఉన్నారు. అయితే.. ఐపీఎల్‌లో ఓ ఫ్రాంచైజీ తరఫున అత్యధిక పరుగుల రికార్డు మాత్రం టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి పేరు మీద ఉంది. మొదటి నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న కోహ్లీ.. మొత్తం 224 మ్యాచ్‌ల్లో 6706 పరుగులు సాధించాడు. ఇందులో 5 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
BJP Social Justice Week : బీజేపీ సామాజిక న్యాయ వారోత్సవాలు
కాగా.. బుధవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ 5 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (60), శిఖర్ ధవన్ (86 నాటౌట్) అర్థశతకాలతో చెలరేగడంతో.. పంజాబ్ అంత భారీ స్కోరు చేయగలిగింది. ఇక 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు.. 20 ఓవర్లలో 192 పరుగులే చేయగలిగింది. నిజానికి.. 124 పరుగులకే రాజస్థాన్ 6 వికెట్లు కోల్పోవడంతో, విజయంపై ఆ జట్టు ఆశలు వదులుకుంది. ఆ సమయంలో హెట్‌మైర్ (36), ధ్రువ్ జురెల్ (32) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో, దాదాపు విజయతీరాలకు చేరింది. కానీ.. చివర్లో కర్రన్ తెలివైన బౌలింగ్‌తో రాజస్థాన్ గెలుపును అడ్డుకున్నాడు.
Hair Cut: బార్బర్ చేసిన హెయిర్ కట్ నచ్చలేదని.. బాత్రూంలోకి వెళ్లి..