Sanjay Manjrekar: లైవ్‌లో మాజీ క్రికెటర్ల మధ్య వార్.. అద్దంలో చూసుకో అంటూ ఒకరిపై మరొకరు సెటైర్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Manjrekar and Murali Kartik On-Air Spat: మాజీ భారత క్రికెటర్లు సంజయ్ మంజ్రేకర్, మురళీ కార్తీక్ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఈ ఇద్దరు లైవ్ టెలికాస్ట్‌లో ఒకరిపై మరొకరు సెటైర్లు వేసుకున్నారు. కొంతసేపు ఇద్దరి మధ్య సంభాషణ ఘాటుగా సాగినప్పటికీ.. చివరకు మంజ్రేకర్ వెనక్కి తగ్గి పరిస్థితిని చక్కదిద్దారు. మంజ్రేకర్, కార్తీక్ మధ్య మాటల యుద్ధంకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు కామెంట్ల వర్షం కురుస్తోంది. శ్రీలంకతో గాలె వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు లంచ్ బ్రేక్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
లంచ్ బ్రేక్ సమయంలో స్టూడియోలో ఉన్న మురళీ కార్తీక్.. గాలెలో కామెంటరీ చేస్తున్న సంజయ్ మంజ్రేకర్‌పై సరదాగా విమర్శలు చేశారు. మంజ్రేకర్ మాట్లాడేటప్పుడు ఆయన ముఖ కవళికల్లో కనిపించే ‘పౌట్’ గురించి కార్తీక్ ప్రస్తావించారు. ఆ పౌట్ కారణంగా ఆయన చెప్పేది కొన్నిసార్లు అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ‘మీ పౌట్ సెంచరీలోనే అత్యుత్తమంగా ఉంది. కానీ ఆ పౌట్ కారణంగా మీరు చెప్పేది మాకు అర్థం కావడం లేదు. కాబట్టి దాన్ని కాస్త తగ్గించండి’ అంటూ కార్తీక్ లైవ్‌లో సెటైర్ వేశారు.
Also Read
- Ayush Shetty: ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సంచలనం.. ప్రపంచ నెం.1 'షి యూకీ'ని మట్టికరిపించిన ఆయుష్ శెట్టి..!
- Babar Azam: బాబర్ ఆజంకు బిగ్ షాక్.. పాక్‌కు కొత్త కెప్టెన్..
- Premier League: ఆ జట్టుకు బిగ్ షాక్.. లీగ్ నుంచి అవుట్..
- Ravindra Jadeja: మైండ్ బ్లోయింగ్ రికార్డ్.. అనిల్ కుంబ్లే తర్వాత ఆ మైలురాయి దాటిన 'స్టార్ ఆల్‌రౌండర్'..
మురళీ కార్తీక్ వ్యాఖ్యలకు సంజయ్ మంజ్రేకర్ కూడా అదే స్థాయిలో స్పందించారు. తనపై కెమెరా ఉంచడం కంటే తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న అజింక్య రహానేను చూపించాలని కోరారు. జింక్స్ తనకంటే చూడటానికి, మాట్లాడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటాడంటూ కార్తీక్‌పై పంచ్ వేశారు. ‘ఇది కాస్త ఎక్కువైంది. కెమెరాను మరో వ్యక్తి వైపు తిప్పగలరా?. అతను చాలా ఆహ్లాదకరమైన వ్యక్తి. ముఖం కూడా చాలా బాగుంటుంది’ అంటూ మంజ్రేకర్ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా.. అద్దంలో తనను తాను చూసుకుంటూ ‘సూపర్బ్.. సూపర్బ్.. సూపర్బ్’ అంటూ కార్తీక్ గొంతును అనుకరిస్తూ మంజ్రేకర్ మరో సెటైర్ వేశారు.
సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యలకు మురళీ కార్తీక్ కూడా వెంటనే కౌంటర్ ఇచ్చారు. ‘నేను అద్దంలో చూసుకోను. అది మీరు చేసే పని’ అంటూ బదులిచ్చారు. దీంతో లైవ్ ప్రసారంలో ఇద్దరు మాజీ క్రికెటర్ల మధ్య మాటల యుద్ధం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే సంభాషణ మరింత ముదరకముందే మంజ్రేకర్ పరిస్థితిని సరదాగా మార్చే ప్రయత్నం చేశారు. తమ మధ్య జరుగుతున్న ఈ వాగ్వాదాన్ని సోషల్ మీడియా అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తారని వ్యాఖ్యానించారు. ‘అద్దంలో చూసుకోవడానికి ఒక కారణం ఉండాలి. మీ విషయంలో అది అంతగా ప్రోత్సాహకరంగా ఉండకపోవచ్చు. ఏదేమైనా.. మనిద్దరం హద్దులు దాటేలా ఉన్నాం. సోషల్ మీడియాకు మాత్రం మంచి కంటెంట్ దొరుకుతుంది’ అంటూ మంజ్రేకర్ నవ్వుతూ వ్యాఖ్యానించారు.
సంజయ్ మంజ్రేకర్, మురళీ కార్తీక్ సరదా మాటల యుద్ధానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు కూడా ఇద్దరు మాజీ క్రికెటర్ల మధ్య జరిగిన సంభాషణపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు. శ్రీలంక-భారత్ టెస్టు మ్యాచ్ మధ్యలో జరిగిన ఈ సరదా ఘటన క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఇక తొలి టెస్టులో భారత్ తిరుగులేని స్థితిలో నిలిచింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకే ఆలౌటైంది. దాంతో టీమిండియా 178 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది. వరుణుడు కరుణిస్తే.. మ్యాచ్ మనదే అవుతుంది.
Things got a bit ugly as Manjrekar suggested that Rahane has a pleasant face, unlike Kartik. pic.twitter.com/SoXPtLbYls
— Cricketopia (@CricketopiaCom) August 18, 2026
తాజావార్తలు
-
Sanjay Manjrekar: లైవ్‌లో మాజీ క్రికెటర్ల మధ్య వార్.. అద్దంలో చూసుకో అంటూ ఒకరిపై మరొకరు సెటైర్లు!
-
Captain India: కార్తీక్ ఆర్యన్ మూవీకి హీరోయిన్ ఫిక్స్.. 9 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి రీఎంట్రీ!
-
Explainer: గల్ఫ్‌లో కొత్త ముసలం మొదలైందా? శత్రువులగా మారిన ప్రాణ స్నేహితులు!
-
Jeep Compass 85th Anniversary Edition లాంచ్.. ధర రూ.26.70 లక్షలు, కేవలం 85 యూనిట్లే!
-
Votes Cancelled: రాజధానిలో 43 లక్షల ఓట్లు గల్లంతు.. మీ ఓటు ఉందా..? లేదా..? తెలుసుకోండిలా..
ట్రెండింగ్
-
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
-
రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!
-
Jio Prime Membership: గుడ్‌న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!