NTV Telugu Site icon

Virat Kohli: కోహ్లీ ఫామ్ ‘తుఫాను ముందు ప్రశాంతత’ అంటున్న టీమిండియా మాజీ ప్లేయర్..

Kohli

Kohli

ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ సమరంలో టీమిండియా సూపర్ 8 లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గ్రూపు మ్యాచ్లో ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే అధికారికంగా టీమిండియా రెండో రౌండ్ కు అర్హతను సాధించింది. అయితే జరిగిన మూడు మ్యాచ్ లలో తక్కువ స్కోరులకే మ్యాచ్లు ముగియడంతో టీమిండియా అభిమానులు కాస్త నిరాశగానే ఉన్నారని చెప్పవచ్చు. ఇకపోతే టీమిండియా ప్రపంచ కప్ లో జరిగిన మూడు మ్యాచ్లలో విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలమయ్యారు. అయితే ఈ విషయం ఆందోళన కలిగించే విషయం కాదంటూ టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ తన అభిప్రాయాన్ని తెలిపాడు.

Darshan Custody Extended : కన్నడ నటుడు దర్శన్ కి షాక్, పోలీస్ కస్టడీ పొడిగింపు

అమెరికాతో జరిగిన మ్యాచ్ లో గోల్డెన్ డకౌట్ గా వెనుతిరగగా విరాట్ కోహ్లీకి ఇది ఆందోళన కలిగించే విషయం కాదని.. అది కేవలం తుఫాను ముందు ఉండే ప్రశాంతత లాంటిది అంటూ ఆయన అభిప్రాయపడ్డాడు. అయితే ప్రపంచ కప్ లో జరిగిన మూడో మ్యాచ్లో ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్లో 1, పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో 4 పరుగులు మాత్రమే చేయడంతో ఇప్పుడు అందరూ విరాట్ కోహ్లీ ఫామ్ పై విమర్శలు చేస్తున్నారు. ఇకపోతే ఈ సీరియస్ ముందు జరిగిన ఐపీఎల్ 17వ సీజన్ లో టాప్ స్కోరర్గా నిలిచి ఆరెంజ్ క్యాప్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

SBI Recruitment 2024: ఎస్‌బీఐలో ఉద్యోగాలు..భారీగా జీతం..హైదరాబాద్ లో కూడా అవకాశం

ఇకపోతే నేడు జరగబోయే కెనడా మ్యాచ్ ను ఫ్లోరిడా కి షిఫ్ట్ చేశారు. ఇక ఈ మ్యాచ్ లోనైనా విరాట్ కోహ్లీ తన ఫామ్ ని తిరిగి పొందుతాడంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక మరోవైపు ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్లలో అత్యధికంగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ 96 పరుగులు చేయగా.. ఆ తర్వాత రోహిత్ 68 పరుగులతో., ఆపై సూర్య కుమార్ యాదవ్ 59 పరుగులతో మాత్రమే ఈ టోర్నీలో 50 పరుగులను చేశారు.