Sana Mir: వంటగదిలో రోటీలు చేసుకోండని పురుష క్రికెటర్లను అంటారా?.. ఈ లింగ వివక్ష ఎందుకు!
- టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ నిరాశాజనక ప్రదర్శన
- పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్టుపై విమర్శలు
- రోటీలు చేయాలని ఎవరైనా అంటారా?
- అమ్మాయిలు ఎన్నో అడ్డంకులు దాటాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sana Mir Slams Sexist Criticism of Pakistan Women’s Cricket Team: పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్టుపై వస్తున్న విమర్శల తీరును పాక్ మాజీ కెప్టెన్ సనా మీర్ తీవ్రంగా తప్పుబట్టారు. మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ జట్టు నిరాశాజనక ప్రదర్శన చేసినప్పటికీ.. విమర్శలు కేవలం ఆటపైనే ఉండాలని, లింగ వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని స్పష్టం చేశారు. పురుషుల జట్టు ఓడితే ఎవరైనా వంటగదికి వెళ్లి రొట్టెలు చేయాలని అంటారా? అని ఆమె ప్రశ్నించారు. మహిళలు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలంటే ఎన్నో సామాజిక, కుటుంబపరమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని సనా మీర్ గుర్తుచేశారు.
రోటీలు చేయాలని ఎవరైనా అంటారా?:
టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ మహిళల జట్టు దారుణ ప్రదర్శన చేసింది. భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ల చేతిలో వరుస పరాజయాలు చవిచూసింది. చివరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై గెలిచి.. మెగా టోర్నీని ముగించింది. అయితే జట్టు ప్రదర్శనపై సోషల్ మీడియాలో, పలు వేదికల్లో వచ్చిన విమర్శలు సనా మీర్‌ను తీవ్రంగా కలచివేశాయి. ఒక పాకిస్థానీ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘పురుషుల జట్టు ఓడితే ఎవరైనా వాళ్లను వంటగదికి వెళ్లి రోటీలు చేయాలని అంటారా?. ఎవరూ అలా అన్నారు. కానీ మహిళల జట్టు ఓడితే అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు?. ఇది స్పష్టమైన ద్వంద్వ వైఖరి. జట్టు ఆశించిన స్థాయిలో ఆడలేదనే విమర్శలు చేయొచ్చు. కానీ మహిళలు కావడం వల్ల లింగ వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేయడం సరికాదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Stokes-Archer: వికెట్ పడినా సెలబ్రేషన్స్ చేసుకొని ఆర్చర్.. స్టోక్స్ అసహనం.. అసలు కారణం ఇదే!
- Sourav Ganguly: అతడు ఓ మూర్ఖుడు.. ఒకసారి మోసపోయా, రెండోసారి మోసపోను!
- Vaibhav Sooryavanshi Debut: వైభవ్ సూర్యవంశీ టీమిండియా అరంగేట్రం కష్టమే!
- Imad Wasim: మాజీ భార్య సంచలన ఆరోపణలు.. మౌనం వీడిన పాక్ క్రికెటర్ ఇమాద్ వసీం
అమ్మాయిలు ఎన్నో అడ్డంకులు దాటాలి:
ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ 2026కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సనా మీర్.. జట్టు ప్రదర్శనపై అందరికీ నిరాశ ఉందని, కానీ విమర్శించే విధానమే తనను ఎక్కువగా బాధిస్తోందని అన్నారు. ‘ఇన్ని సంవత్సరాలు గడిచినా మహిళల క్రికెట్‌కు ఇప్పటికీ తగిన గౌరవం లభించడం లేదు. వారి ఆటను క్రికెట్ పరంగా కాకుండా మహిళలు అనే కోణంలోనే ఎక్కువగా చుస్తున్నారు. పాకిస్థాన్‌లో మహిళలు ప్రొఫెషనల్ క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలంటే ఎన్నో సామాజిక, కుటుంబపరమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అమ్మాయిలు ఎన్నో అడ్డంకులు దాటాలి. వారు సంచలన విజయాలు సాధించే సామర్థ్యం ఉందని నిరూపించడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ముందుగా మహిళల క్రికెట్‌పై సమాజంలో ఉన్న ఆలోచనా విధానం మారాలి. అప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది’ అని అన్నారు.
పెద్దగా పోటీ లేకపోవడం కూడా:
సోషల్ మీడియాలో కొందరు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో మహిళా క్రికెటర్లను ఎగతాళి చేసే వీడియోలు రూపొందించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని కూడా పాక్ మాజీ కెప్టెన్ సనా మీర్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి చర్యలు ఆటగాళ్లతో పాటు వారి కుటుంబాలను కూడా తీవ్రంగా బాధిస్తున్నాయని చెప్పారు. దేశంలో మహిళల క్రికెట్ అభివృద్ధి చెందాలంటే ప్రతిభావంతులైన ఆటగాళ్ల సంఖ్యను పెంచడం, దేశవాళీ టోర్నీలను మరింత విస్తృతంగా నిర్వహించడం అవసరమని సూచించారు. ప్రస్తుతం జట్టులో స్థానాల కోసం పెద్దగా పోటీ లేకపోవడం కూడా ఆటగాళ్ల ఆలోచనా విధానంపై ప్రభావం చూపుతోందని సనా మీర్ అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Sana Mir: వంటగదిలో రోటీలు చేసుకోండని పురుష క్రికెటర్లను అంటారా?.. ఈ లింగ వివక్ష ఎందుకు!
-
JioHotstar Trending: 12,000 కోట్ల బ్లాక్ బస్టర్‌కే షాక్.. జియో హాట్‌స్టార్‌లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దే హవా!
-
iPhone 16: ఫ్లిప్‌కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
-
NBK 112 : బాలయ్య -కొరటాల మాస్ సినిమా కాదు.. అంతకుమించి
-
Hyderabad: షా గౌస్, మెహ్‌ఫిల్‌లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!