Sairaj Bahutule: వైభవ్ మంచి బాలుడు.. శ్రీలంక ఆటగాళ్లు ఎంతలా రెచ్చగొట్టారో!
- భారత్-ఎ, శ్రీలంక-ఎ మ్యాచ్‌లో పెద్ద వివాదం
- శ్రీలంక ఆటగాళ్లతో వైభవ్ గొడవ
- వైభవ్ మంచి బాలుడు అంటున్న బహుతులే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sairaj Bahutule defended Vaibhav Sooryavanshi: భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య జరిగిన ట్రై సిరీస్ మ్యాచ్ అనంతరం పెద్ద వివాదమే చోటుచేసుకున్న విషయం తెలిసిందే. శ్రీలంక ఆటగాళ్లతో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గొడవకు వెళ్ళాడు. ఈ వివాదంపై భారత జట్టు స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే స్పందించారు. ఈ ఘటనను దురదృష్టకరంగా అభివర్ణించారు. వైభవ్ చాలా ప్రశాంతమైన వ్యక్తి అని, ఎవరైనా అతడిని అదే పనిగా రెచ్చగొట్టి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. మైదానంలో ఎలా ప్రవర్తించాలో శ్రీలంక ఆటగాళ్లకు కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని బహుతులే వ్యాఖ్యానించారు.
దురదృష్టకరమైన సంఘటన:
సూపర్ ఓవర్లో శ్రీలంక-ఎ విజయం సాధించిన అనంతరం వైభవ్ సూర్యవంశీ, శ్రీలంక ఆటగాడు విశెన్ హలంబగే మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాటామాటా పెరగడంతో ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకోవడం వరకు పరిస్థితి వెళ్లింది. పక్కనే ఉన్న ఆటగాళ్లు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై స్పందించిన సాయిరాజ్ బహుతులే.. ‘ఇది నిజంగా దురదృష్టకరమైన సంఘటన. వైభవ్‌ను ఎంతవరకు రెచ్చగొట్టారో మనకు పూర్తిగా తెలియదు. నాకు తెలిసినంత వరకు వైభవ్ చాలా ప్రశాంతంగా, క్రమశిక్షణతో ఉండే బాలుడు. ఇలాంటి ఘటన జరగడం బాధాకరం’ అని అన్నారు.
Also Read
- Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
- Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
- PCB: షోయబ్ అక్తర్‌కు పీసీబీలో కీలక పోస్టు..! చైర్మన్ నఖ్వీతో భేటీ
- IND vs WI 2nd ODI: ఆ ముగ్గురు టీమిండియా స్టార్లకు నిరాశే.. ప్లేయింగ్ 11, హెడ్ టు హెడ్, పిచ్ రిపోర్ట్ ఇదే!
వైభవ్‌కు సరైన మార్గనిర్దేశం చేస్తాం:
వైభవ్ చిన్న వయసులోనే భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడని, అతనిపై పెద్ద బాధ్యతలు ఉన్నాయని బహుతులే గుర్తుచేశారు. ‘వైభవ్‌కు అవసరమైన సూచనలు తప్పకుండా అందిస్తాం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మాట్లాడతాం. అతడు యువ ఆటగాడు.. ఈ ఘటన నుంచి నేర్చుకుంటాడు. కేవలం భారత ఆటగాళ్లకే కాదు, శ్రీలంక ఆటగాళ్లకు కూడా మైదానంలో ప్రవర్తనపై అవగాహన కల్పించాలి. మైదానంలో ఎలా ప్రవర్తించాలో శ్రీలంక ఆటగాళ్లకు చెప్పాలి. అదే విధంగా మన ఆటగాళ్లకూ ఈ విషయాలు వర్తిస్తాయి. ఇలాంటి సంఘటనలను సులభంగా నివారించవచ్చు. ఇరు జట్ల కోచ్‌లు, సీనియర్ సభ్యులు ఈ విషయాల్లో ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయాలి’ అని స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన ఘటన:
సూపర్ ఓవర్ ఓటమి అనంతరం వైభవ్ సూర్యవంశీ, సూర్యాంశ్ షెడ్జేలను శ్రీలంక ఆటగాళ్లు స్లెడ్జింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా విశెన్ హలంబగే చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహించిన వైభవ్.. ఘాటుగా స్పందించాడని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానుల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. కొంతమంది వైభవ్ ప్రవర్తనను తప్పుబట్టగా.. మరికొందరు అతడిని ముందుగా రెచ్చగొట్టారని, అందుకే స్పందించాడని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఘటనపై భారత కోచ్ సాయిరాజ్ బహుతులే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారాయి.
తాజావార్తలు
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
-
Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
-
UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
-
Telangana Agriculture : పప్పుధాన్యాల సాగులో తెలంగాణకు రెండో స్థానం.. కేంద్రానికి కీలక ప్రతిపాదనలు
-
Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!