Ruturaj Gaikwad: బ్యాటింగ్‌లో ఫెయిల్.. ఫీల్డింగ్‌లో మాత్రం అదరగొట్టాడు.. ఇంకో ఛాన్స్ వచ్చేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ruturaj Gaikwad Stunning Catch: న్యూజిలాండ్‌తో జరిగిన ఐదవ వన్డే మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్‌లో విఫలమైనప్పటికీ.. ఫీల్డింగ్‌లో మాత్రం తన ప్రతిభను చాటుకున్నాడు. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్ విల్ యంగ్ ఇచ్చిన క్యాచ్‌ను పరుగెత్తుకుంటూ వచ్చి అందుకున్నాడు. దీంతో భారత జట్టుకు కీలక బ్రేక్‌త్రూ లభించింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 17వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
అర్ష్‌దీప్ సింగ్ వేసిన 16.3వ ఓవర్లోని షార్ట్ పిచ్ బంతిని విల్ యంగ్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే లెగ్‌సైడ్ దిశగా వెళ్లిన బంతిని గమనించిన రుతురాజ్ గైక్వాడ్.. వెనక్కి పరుగెత్తుకుంటూ వచ్చి అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. దీంతో 22 పరుగులు చేసిన యంగ్ పెవిలియన్‌కు చేరాడు. అప్పటికి న్యూజిలాండ్ స్కోరు 64 పరుగులు కాగా.. ఆ జట్టు రెండో వికెట్‌ను కోల్పోయింది. గత మ్యాచ్‌లో సెంచరీ బాదిన యంగ్.. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ పట్టిన అద్భుత క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read
- Virat Kohli: అప్పుడు 18, ఇప్పుడు 21.5.. విరాట్ కోహ్లీ కెరీర్లోనే చెత్త వన్డే సిరీస్!
- Yash Thakur Duck out: ఒక్క పరుగు చేయకుండానే.. 16 ఏళ్ల తర్వాత ధోనీ, సచిన్, కోహ్లీల సరసన యశ్ ఠాకూర్..!
- IND vs PAK U19: ‘ఓ మై గాడ్.. వాట్ ఏ మ్యాచ్’.. టీమిండియా త్రిల్లింగ్ విక్టరీపై వైభవ్ పోస్ట్ వైరల్!
- India Top ODI Captains: ధోనీ టాప్.. కోహ్లీ లాస్ట్..! టాప్ కెప్టెన్స్ వీరే అంటున్న టీమిండియా మాజీ ప్లేయర్..
అయితే ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ మాత్రం నిరాశపరిచింది. 27 బంతులు ఎదుర్కొన్న అతడు 18 పరుగులే చేసి వెనుదిరిగాడు. జాకబ్ డఫీ వేసిన 8.1వ ఓవర్లో బంతిని ఆడేందుకు ప్రయత్నించగా.. బ్యాట్‌కు ఎడ్జ్ తగిలింది. దీంతో వికెట్ కీపర్ టిమ్ సీఫర్ట్ సులభంగా క్యాచ్ అందుకున్నాడు. కీలక సమయంలో వికెట్ కోల్పోవడంతో రుతురాజ్ మరోసారి తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. నాలుగో వన్డేలో 13 బంతుల్లో 5 రన్స్ మాత్రమే చేశాడు. ఈ పర్యటనలో రెండు మ్యాచ్‌ల్లో 23 పరుగులే చేశాడు.
టెస్టు సిరీస్ కోసం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జట్టును వీడటంతో రుతురాజ్‌కు అవకాశం దక్కింది. అయితే వచ్చిన రెండు అవకాశాల్లోనూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. టీమిండియాలో చోటు కోసం పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రుతురాజ్‌కు భవిష్యత్తులో మరో అవకాశం దక్కుతుందా? లేదా? అన్నది చూడాలి. బ్యాటింగ్‌లో పరుగులు సాధించలేకపోయినా.. ఈ మ్యాచ్‌లో పట్టిన అద్భుతమైన క్యాచ్ మాత్రం అతడి ఫీల్డింగ్ నైపుణ్యాన్ని మరోసారి చాటిచెప్పింది.
A partnership-breaker, capped off with a stunning effort in the deep. 💥
Ruturaj Gaikwad, take a bow! 👏
Watch HERO VIDA India Tour of New Zealand, 5th ODI, LIVE NOW on Sony Sports Network TV channels, Sony Vizha & Sony LIV.
#SonySportsNetwork #SonyVizha #SonyLIV #NZvIND https://t.co/ZekunxZq6Z
— Sony Sports Network (@SonySportsNetwk) November 15, 2026
తాజావార్తలు
-
Ruturaj Gaikwad: బ్యాటింగ్‌లో ఫెయిల్.. ఫీల్డింగ్‌లో మాత్రం అదరగొట్టాడు.. ఇంకో ఛాన్స్ వచ్చేనా?
-
CM Delhi Tour: ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీతో కీలక భేటీ..!
-
Virat Kohli: అప్పుడు 18, ఇప్పుడు 21.5.. విరాట్ కోహ్లీ కెరీర్లోనే చెత్త వన్డే సిరీస్!
-
Yash Thakur Duck out: ఒక్క పరుగు చేయకుండానే.. 16 ఏళ్ల తర్వాత ధోనీ, సచిన్, కోహ్లీల సరసన యశ్ ఠాకూర్..!
-
Huawei Mate X8: 8.15 ఇంచుల డిస్ప్లే, 16GB RAMతో కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Huawei Mate X8 వచ్చేస్తోంది
ట్రెండింగ్
-
India Top ODI Captains: ధోనీ టాప్.. కోహ్లీ లాస్ట్..! టాప్ కెప్టెన్స్ వీరే అంటున్న టీమిండియా మాజీ ప్లేయర్..
-
Cameras on Vegetable Vendors: కూరగాయల మార్కెట్లో AI కలకలం.. వ్యాపారుల తలపై వింత గ్యాడ్జెట్లు.. అసలేం జరుగుతోంది?
-
Toyota Innova Hycross Facelift: E100 ఇథనాల్ టెక్నాలజీతో నవంబర్ 25న కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్..!
-
200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!