Site icon NTV Telugu

KKR vs RCB: పీకల్లోతు కష్టాల్లో ఆర్సీబీ.. 10 ఓవర్లలో ఇదీ పరిస్థితి!

Rcb 10 Overs

Rcb 10 Overs

Royal Challengers Bangalore Lost 5 Wickets In First 10 Overs: ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే! ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. ఆర్సీబీ ముందు 205 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ లక్ష్యాన్ని ఛేధించేందుకు రంగంలోకి దిగిన ఆర్సీబీ.. శుభారంభమే చేసింది. విరాట్ కోహ్లీ (21), పాఫ్ డు ప్లెసిస్ (23) కలిసి మొదట్లో మెరుపులు మెరిపించారు. అప్పుడే కేకేఆర్ కెప్టెన్ తెలివి ప్రదర్శించాడు. ఫాస్ట్ బౌలింగ్‌లో ఆ ఇద్దరు చెలరేగి ఆడుతుండటంతో.. స్పిన్నర్లను రంగంలోకి దింపాడు. ఇంకేముంది.. కెప్టెన్ వేసిన పథకం ఫలించింది. స్పిన్నర్లు తిప్పేయడంతో ఆర్సీబీ వరుసగా వికెట్లు కోల్పోయింది.

Sharma Sisters: విప్పి చూపించడంలో అక్కను మించిన చెల్లి.. సరిపోయారు ఇద్దరు

తొలుత సునీల్ నరైన్ ఆర్సీబీ స్టార్ బ్యాటర్ కోహ్లీ వికెట్ తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతని బంతిని పసిగట్టలేకపోయిన కోహ్లీ.. క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన వరుణ్ చక్రవర్తి కూడా బంతిని తిప్పేయడంతో.. డు ప్లెసిస్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం మ్యాక్స్‌వెల్, హర్షల్, షాదాబ్ పటేల్ కూడా ఒకరి తర్వాత మరొకరు వెనువెంటనే పెవిలియన్ బాట పట్టారు. ఇలా 10 ఓవర్లు ముగిసే సమయానికి ఐదు కీలక వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ కేవలం 69 పరుగులే చేయగలిగింది. లక్ష్యాన్ని ఛేదించాలంటే.. మరో 10 ఓవర్లలో 136 పరుగులు చేయాలి. మరి.. ఆర్సీబీ ఆ లక్ష్యాన్ని ఛేధిస్తుందా? శార్దూల్ తరహాలోనే ఆర్సీబీ జట్టును ఆదుకునే నాథుడు ఉన్నాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ!

Shardul Thakur: లార్డ్ శార్దూల్.. తొలి అర్థశతకంతోనే మూడు రికార్డులు బద్దలు

Exit mobile version