Site icon NTV Telugu

Rohit Sharma: నన్ను ఎంతగా అణిచివేస్తే.. అంతగా పైకొస్తా.. రోహిత్ ట్వీట్ వైరల్

టీమిండియాకు ప్రస్తుతం మూడు ఫార్మాట్లలోనూ రోహిత్ శర్మనే కెప్టెన్. గతంలో రోహిత్ టెస్టుల్లో పనికిరాడని ఎన్నో విమర్శలు వచ్చాయి. అలాంటి విమర్శలను తట్టుకుని ఏకంగా టెస్టు జట్టుకే నాయకత్వం వహించే స్థాయికి రోహిత్ ఎదిగాడు. ఈ నేపథ్యంలో మూడేళ్ల క్రితం రోహిత్ శర్మ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2018 సెప్టెంబర్ 1న రోహిత్ అభిమానులతో #AskRohit నిర్వహించాడు.

ఈ సందర్భంగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు రోహిత్ సమాధానమిస్తూ.. ‘నన్ను ఎంతగా అణచివేస్తే అంతగా పైకి వస్తా’ అంటూ పేర్కొన్నాడు. దీంతో రోహిత్ ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. గత ఏడాది టీ20 ప్రపంచకప్‌కు రోహిత్‌ను బీసీసీఐ కెప్టెన్‌గా నియమించింది. అక్కడి నుంచి వన్డేలకు.. అంతటితో ఆగకుండా టెస్టులకు కూడా రోహిత్ కెప్టెన్‌ అయ్యాడు. ఈ సందర్భంగా రోహిత్ సామర్థ్యంపై నెటిజన్‌లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Exit mobile version