NTV Telugu Site icon

Team India: టాస్ సమయంలో రోహిత్ సైలెంట్.. కారణం ఇదేనా?

Rohit Sharma

Rohit Sharma

Team India: రాయ్‌పూర్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో భారత బౌలర్లు విజృంభించారు. న్యూజిలాండ్‌ను 34.3 ఓవర్లలోనే 108 పరుగులకు ఆలౌట్ చేశారు. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రోహిత్ ఏం తీసుకోవాలో తెలియక అలానే ఉండిపోయాడు. రోహిత్ అంత సేపు ఆలోచించడం చూసిన కామెంటేటర్ రవిశాస్త్రి ‘ఏం చేస్తున్నావ్ రోహిత్’ అని ప్రశ్నించాడు. అయితే చివరకు ఫీల్డింగ్ చేస్తామని రోహిత్ చెప్పాడు. అయితే టాస్ సమయంలో రోహిత్ తన నిర్ణయం చెప్పడానికి కారణం పిచ్ అని తెలుస్తోంది. ఎందుకంటే రాయ్‌పూర్‌లో ఇదే తొలి అంతర్జాతీయ వన్డే. పిచ్ ఎలా స్పందిస్తుందో ఎవ్వరికీ అంతుబట్టలేదు. టాస్‌కు ముందు టీమ్ మీటింగ్‌లో కూడా ముందుగా బౌలింగ్ చేయాలా? లేదంటే బ్యాటింగ్ చేయాలా అని చర్చించుకుంటూ ఉన్నామని.. అదే ఆలోచిస్తూ ఉండిపోయానని రోహిత్ అన్నాడు.

Read Also: Man Chops Private Part: వీడెవడండీ.. పెళ్లాం రావడం లేదని దాన్నే కోసేసుకున్నాడు..

మరోవైపు తొలి వన్డే ఆడిన హైదరాబాద్‌లో ఫ్లడ్ లైట్ల కింద బౌలింగ్ చేయాలని అనుకున్నామని, ఇక్కడ బౌలింగ్ చేయాలా? లేక బ్యాటింగ్ చేయాలా? అనే డైలమాలో ఉండిపోయానని చెప్పాడు. అయితే రెండో వన్డే కోసం జట్టులో ఎలాంటి మార్పులూ లేవని, తొలి వన్డే ఆడిన జట్టుతోనే బరిలో దిగుతున్నామని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. అటు కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బౌలింగ్ చేయాలనే అనుకున్నామని చెప్పాడు. న్యూజిల్యాండ్ జట్టులో కూడా ఎలాంటి మార్పులూ లేవని వెల్లడించాడు. కాగా ఐసీసీ వన్డే ర్యాంకుల్లో న్యూజిలాండ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. టీమిండియా నాలుగో ర్యాంకులో ఉంది. రెండో స్థానంలో ఇంగ్లండ్, మూడో స్థానంలో ఆస్ట్రేలియా ఉన్నాయి.