Rohit Sharma Record: నాగపూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ మొత్తం నాలుగు సిక్సర్లు కొట్టాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. దీంతో అతడు న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల (173) రికార్డును చెరిపేశాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 176 సిక్సర్లు ఉన్నాయి. ఈ జాబితాలో మార్టిన్ గప్తిల్ (173), వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ (124) ఉన్నారు. అయితే టీమిండియా తరఫున అత్యధిక కొట్టిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ తర్వాత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 104 సిక్సర్లతో రెండో స్థానంలో నిలిచాడు.
Read Also:Rana Naidu Teaser: ఫిక్సర్ vs ఫాదర్.. తండ్రికొడుకుల మధ్య యుద్ధం
కాగా నాగపూర్‌లో జరిగిన టీ20లో రోహిత్ శర్మ వీరబాదుడితో 91 పరుగుల లక్ష్యాన్ని భారత్ 7.2 ఓవర్లలోనే అందుకుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 20 బంతుల్లో 4 సిక్సర్లు, 4 ఫోర్ల సహాయంతో 46 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో భారత్ సులభంగా విజయం సాధించింది. దీంతో ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు కూడా రోహిత్ సొంతం చేసుకున్నాడు. మరోవైపు అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా తరఫున అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న ఆటగాళ్ల జాబితాలో రోహిత్ రెండో స్థానాన్ని ఆక్రమించాడు. ఇప్పటివరకు రోహిత్ శర్మ టీ20ల్లో 12 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా సెలెక్ట్ అయ్యాడు. అతడి కంటే విరాట్ కోహ్లీ ఒక్క అడుగు ముందున్నాడు. కోహ్లీ ఖాతాలో 13 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు ఉన్నాయి.