Site icon NTV Telugu

Asia Cup 2022: టీమిండియా తరఫున ఓపెనింగ్ చేసేదెవరు? రోహిత్ ఏమన్నాడు?

Rohit Sharma

Rohit Sharma

ఆసియాకప్‌లో కాసేపట్లో హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. పాకిస్థాన్‌తో కీలక మ్యాచ్‌ జరుగుతున్న నేపథ్యంలో టీమిండియా తరఫున ఓపెనర్లుగా ఎవరు బరిలోకి దిగుతారని విలేకరుల సమావేశంలో కెప్టెన్ రోహిత్ శర్మను అడగ్గా.. టాస్ వేశాక ఎవరు ఓపెనర్లుగా వస్తారో మీరే చూడండి అంటూ రోహిత్ సమాధానం చెప్పాడు. తమకు కొన్ని రహస్యాలు ఉంటాయని.. వాటిని బయటకు చెప్పలేమని స్పష్టం చేశాడు. కొంతకాలంగా టీమిండియా ఓపెనర్లుగా పలు కాంబినేషన్‌లను టీమ్ మేనేజ్‌మెంట్ ప్రయత్నించింది. రోహిత్-సూర్యకుమార్ యాదవ్, రోహిత్-రిషబ్ పంత్, రోహిత్-కేఎల్ రాహుల్ వంటి కాంబోలను పరీక్షించింది. వీరిలో కొందరు సక్సెస్ కాగా మరికొన్ని కాంబోలు ఫెయిల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో మ్యాచ్ సందర్భంగా జట్టు కూర్పు ఎలా ఉంటుందో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. కేఎల్ రాహుల్ ఇటీవల కాలంలో టచ్‌లో లేకపోవడం, సరైన ప్రాక్టీస్ లేకపోవడంతో ఓపెనింగ్‌లో ఆడిస్తారా లేదా మిడిల్ ఆర్డర్‌లో ఆడిస్తారా అన్న సందిగ్ధం అందరిలోనూ నెలకొంది.

Read Also: Lying Down Championship: 60 గంటలు నిద్రపోయాడు.. రూ.27వేలు గెలుచుకున్నాడు

మరోవైపు ఫైనల్ ఎలెవన్‌లో దినేష్ కార్తీక్‌ను కాకుండా ముగ్గురు ఫాస్ట్ బౌలర్లను తీసుకోవాలని టీమిండియా టెస్ట్ ఆటగాడు పుజారా సూచించాడు. రోహిత్, రాహల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్డిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, చాహల్, భువనేశ్వర్, అవేష్ ఖాన్, అర్ష్ దీప్‌సింగ్‌లను ఎంచుకోవాలని పుజారా అన్నాడు. భారత స్టార్ ఆటగాడు బుమ్రా గాయం కారణంగా టోర్నీకి దూరం కావడంతో అవేష్‌ ఖాన్‌ను తుదిజట్టులోకి తీసుకోవాలని పుజారా అభిప్రాయపడ్డాడు.

https://www.youtube.com/watch?v=x-6ej3zR84c&ab_channel=NTVSports

Exit mobile version