టీమిండియా స్టార్ బ్యాటర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నాడు. మరో 41 పరుగులు చేస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌లో 20 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్‌లో 20,000 పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో భారత బ్యాటర్‌గా రికార్డుల్లో ఎక్కుతాడు. ఈ క్లబ్‌లో దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్ మాత్రమే ఉన్నారు. రాయ్‌పుర్‌లో దక్షిణాఫ్రికాతో నేడు జరిగే రెండో వన్డేలో హిట్‌మ్యాన్ ఈ రికార్డును చేరుకునే అవకాశాలు ఉన్నాయి.
అంతర్జాతీయ క్రికెట్‌లో రన్స్ పరుగుల చేసిన జాబితాలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ 34,357 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నారు. విరాట్ కోహ్లీ (27,808), రాహుల్ ద్రవిడ్ (24,064) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు రోహిత్ శర్మ 503 మ్యాచ్‌ల్లో 42.46 సగటుతో 19,959 పరుగులు చేశాడు. ఇందులో 50 సెంచరీలు, 110 అర్ధ సెంచరీలు ఉన్నాయి. హిట్‌మ్యాన్ టెస్ట్‌లలో 4,301 పరుగులు, వన్డేలలో 11,427 రన్స్, టీ20లలో 4,231 పరుగులు చేశాడు. ఈ సంవత్సరం రోహిత్ వన్డేలలో అద్భుతంగా రాణించాడు. 12 మ్యాచ్‌ల్లో 51.00 సగటుతో 561 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు ఉండగా.. బెస్ట్ స్కోరు 121 నాటౌట్.
Also Read: Maruti Suzuki: మారుతి సుజుకి చరిత్ర.. 30 రోజుల్లో 2.29 లక్షల కార్ల విక్రయాలు!
2024 టీ20 ప్రపంచకప్ తర్వాత రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. గత మే నెలలో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ఇప్పుడు వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో కూడా ఆడనున్నాడు. గత నెలలో ఆస్ట్రేలియా పర్యటనలోని మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో రోహిత్ అర్ధ సెంచరీ, సెంచరీ చేశాడు. రాంచీలో దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో 51 బంతుల్లో 57 పరుగులు చేశాడు. ఈరోజు జరిగే వన్డేలో కూడా చెలరేగడానికి సిద్దమయ్యాడు.
