Site icon NTV Telugu

Rohit-Kohli: విరాట్ కోహ్లీ హిట్.. రోహిత్ శర్మ అట్టర్ ఫ్లాప్!

Rohit Kohli

Rohit Kohli

విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26 తొలి మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన టీమిండియా సీనియర్ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ.. రెండో మ్యాచ్‌లో మాత్రం నిరాశపర్చాడు. శుక్రవారం జైపుర్‌ వేదికగా ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగిన హిట్‌మ్యాన్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. కేవలం ఒక బంతిని మాత్రమే ఎదుర్కొని పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది. ఇనింగ్స్ మొదటి బంతికే దేవేంద్ర సింగ్‌ బోరా బౌలింగ్‌లో జగమోహన్‌ నాగర్‌కోటికి క్యాచ్‌ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇది రోహిత్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. మొదటి మ్యాచ్‌లో సిక్కింపై హిట్‌మ్యాన్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే.

Also Read: Honour Killing: కూతురికి పురుగుల మందు తాగించి.. గొంతు నులిమి హత్య చేసిన తల్లిదండ్రులు!

విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున ఆడుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 61 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌తో 77 రన్స్ చేసి ఔటయ్యాడు. కోహ్లీ ఔట్ తర్వాత ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ దూకుడుగా ఆడుతున్నాడు. గుజరాత్ బౌలర్లను ఓ ఆటాడుకుంటున్నాడు. దాంతో ఢిల్లీ 30 ఓవర్లలో 150 పరుగుల మార్కును అధిగమించింది. పంత్ 79 బంతుల్లో 70 పరుగులు చేసి ఔటయ్యాడు.

Exit mobile version