NTV Telugu Site icon

Shreyas Iyer: రోహిత్ శర్మకి భయం అంటే తెలియదు.. అతని బాడీ లాంగ్వేజ్ ఒక రకమైన అంటువ్యాధి..

Shreyas Iyer, Rohit Sharma

Shreyas Iyer, Rohit Sharma

Shreyas Iyer: స్వదేశంలో జరుగున్న వన్డే ప్రపంచకప్ టోర్నీలో భారత్ విజయానికి తిరుగులేకుండా పోయింది. ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్‌కి చేరుకుంది. వరల్డ్ కప్‌ని ముద్దాడటానికి కేవలం ఒక్క విజయానికి దూరంలో ఉంది. బుధవారం న్యూజిలాండ్‌తో ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచు అనేక రికార్డులకు వేదికగా మారింది.

ఓపెనర్ రోహిత్ శర్మ ఫియర్ లెస్ బ్యాటింగ్‌కి తోడు రన్ మిషన్ విరాట్ కోహ్లీ వన్డేల్లో తన 50వ సెంచరీని పూర్తి చేసుకుని రికార్డ్ సృష్టించారు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్ధలు కొట్టాడు. దీనికి తోడు శ్రేయాస్ అయ్యార్ కివీస్ బౌలర్లపై సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 70 బంతుల్లోనే 105 రన్స్ చేసి భారీ స్కోరుకు బాటలు వేశాడు.

Read Also: China: చైనాలో ఘోర అగ్నిప్రమాదం.. 26 మంది దుర్మరణం

ఇదిలా ఉంటే మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మపై శ్రేయాస్ అయ్యర్ ప్రశంసలు కురిపించారు. రోహిత్ శర్మ మంచి ప్రారంభాన్ని ఇస్తాడని, దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుందని, అతని బాడీ లాంగ్వేజ్ ఓ రకమైన అంటువ్యాధి అని అన్నారు. రోహిత్ శర్మ భయం అంటే తెలియని కెప్టెన్ అని అన్నారు. జట్టు మేనేజ్మెంట్, కెప్టెన్, కోచ్ మద్దతుగా నిలిచారని అన్నారు. ప్రపంచ కప్ తొలి మ్యాచుల్లో నాకు గొప్ప ప్రారంభం దొరకలేదని, అలాంటి సమయంలో కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ మద్దతుగా నిలిచారని చెప్పాడు. ఒత్తిడి పరిస్థితుల్లో కొంత మంది భయాందోళనకు గురవుతారు, కానీ అదే సమయంలో చాలా మంది వ్యక్తుల ముందు ఆడటం సరదాగా ఉంటుందని, మనం మంచి ప్రదర్శన చేస్తే, వారు మనల్ని మరింత పైకి లేపుతారని అన్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోన్నీలో ఒకే ఎడిషన్ లో 500 లేదా అంతకన్నా ఎక్కువ పరుగులు చేసిన మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా శ్రేయాస్ అయ్యర్ రికార్డు సృషించారు. న్యూజిలాండ్ తో నిన్న జరిగిన మ్యాచులో శ్రేయాస్ వరసగా రెండో సెంచరీ చేశాడు. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు, అయ్యర్ 75.14 సగటుతో మరియు 113 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 526 పరుగులు చేశాడు. అతను రెండు సెంచరీలు మరియు మూడు అర్ధసెంచరీలు చేశాడు, అత్యుత్తమ స్కోరు 128 నాటౌట్. ఇప్పటి వరకు టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌లో ఐదో స్థానంలో నిలిచాడు.

Show comments