NTV Telugu Site icon

Rohit Sharma: రిటైర్మెంట్ ఊహాగానాలపై హిట్ మ్యాన్ క్లారిటీ.. కీలక ప్రకటన

Rohith Sharma

Rohith Sharma

ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ తర్వాత టీమిండియా కీలక ఆటగాళ్లు రిటైర్ మెంట్ ప్రకటించబోతున్నారంటూ చర్చలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వన్డేలకు వీడ్కోలు పలుకుతాడని ఊహాగానాలు వెల్లువెత్తాయి. గత సంవత్సరం ప్రపంచ కప్ గెలిచిన తర్వాత అతను T20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినట్లుగానే ఇప్పుడు ఛాంపియన్ ట్రోఫీ అనంతరం వన్డేలకు రిటైర్ మెంట్ పలుకుతాడని అంతా భావించారు. అయితే ఈ పుకార్లకు రోహిత్ స్వయంగా ఫుల్ స్టాప్ పెట్టాడు. రిటైర్మెంట్ ఊహాగానాలపై హిట్ మ్యాన్ క్లారిటీ ఇచ్చాడు. వన్డేల నుంచి తాను రిటైర్ కావడం లేదని రోహిత్ స్పష్టం చేశాడు.

Also Read:US: బీచ్‌లో భారత సంతతి విద్యార్థిని అదృశ్యం.. బికినీలో ఉండగా మాయం

మ్యాచ్ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో రోహిత్ వన్డేలు ఆడటం కొనసాగిస్తానని స్పష్టం చేశాడు. తన భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి ప్రణాళికలు లేవని, కాబట్టి రిటైర్మెంట్‌కు సంబంధించి ఎలాంటి ప్రచారం చేయొద్దని మీడియాను కోరాడు. రోహిత్ ఈ విషయం చెప్పిన తర్వాత, హాలు మొత్తం చప్పట్లతో మార్మోగింది. హిట్ మ్యాన్ నిర్ణయంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అయితే గతంలో చాలా మీడియా నివేదికలలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని ఓడిపోతే రోహిత్ నిష్క్రమణ ఖాయం అని, కానీ అది గెలిస్తే రోహిత్ ఆటను కొనసాగిస్తాడని వెల్లడించాయి.

Also Read:Final Judgement: ప్రణయ్ పరువు హత్య కేసు.. నేడే తుది తీర్పు

ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి రోహిత్ పై ఒత్తిడి ఉంది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ ఓటమి, ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో టెస్ట్ సిరీస్ ఓటమి రోహిత్ కెప్టెన్సీపై ప్రశ్నలను లేవనెత్తాయి. అప్పటి నుంచి ఆయన రిటైర్మెంట్ గురించి వార్తలు వచ్చాయి. కాగా రోహిత్ కెప్టెన్సీలో భారత్ ఆదివారం ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి టీం ఇండియా మూడోసారి ట్రోఫీని కైవసం చేసుకుని, టోర్నమెంట్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా అవతరించింది. కెప్టెన్‌గా రోహిత్‌కు ఇది రెండో ఐసీసీ ట్రోఫీ. దీంతో హిట్ మ్యాన్ ఒకటి కంటే ఎక్కువ ICC ట్రోఫీలను గెలుచుకున్న భారత రెండవ కెప్టెన్ గా హిస్టరీ క్రియేట్ చేశాడు.