Rohit Sharma: సచిన్, కోహ్లీ సరసన రోహిత్ శర్మ.. 14 వేల క్లబ్‌లోకి చేరిన ఐదో భారతీయుడు..

Rohit Sharma Historic Milestone

Rohit Sharma Historic Milestone

భారత బ్యాటింగ్ దిగ్గజం, ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ లిస్ట్-A క్రికెట్‌లో 14,000 పరుగుల మైలురాయిని అధిగమించి, ఈ ఘనత సాధించిన ఐదో భారతీయ బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో రోహిత్ ఈ ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ఫామ్‌లో కనిపించిన అతను 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 123కు పైగా స్ట్రైక్ రేట్‌తో 48 పరుగులు చేశాడు. ప్రస్తుతం రోహిత్ పేరిట 356 లిస్ట్-A మ్యాచ్‌ల్లో 37 శతకాలతో కలిపి మొత్తం 14,038 పరుగులు ఉన్నాయి.

భారత్ తరఫున లిస్ట్-A క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (21,999 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత విరాట్ కోహ్లీ (16,447), సౌరవ్ గంగూలీ (15,622), రాహుల్ ద్రావిడ్ (15,271) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

×
×
Ad

మ్యాచ్ విషయానికి వస్తే..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే, భారత బ్యాటర్లు ఆఫ్ఘన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (110 బంతుల్లో 154 పరుగులు, 22 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (79 బంతుల్లో 125 పరుగులు, 14 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగి సెంచరీలు బాదారు. వీరి ధాటికి భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌట్ అయింది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నంగేయాలియా ఖరోటి 4 వికెట్లు, రషీద్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టారు. సిరీస్‌ను సమం చేయాలంటే ఆఫ్ఘనిస్తాన్ 403 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. ప్రస్తుతం ఆప్ఘనిస్తాన్ 30 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 168 రన్స్ చేసింది.