Rohit Sharma: సచిన్, కోహ్లీ సరసన రోహిత్ శర్మ.. 14 వేల క్లబ్‌లోకి చేరిన ఐదో భారతీయుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత బ్యాటింగ్ దిగ్గజం, ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ లిస్ట్-A క్రికెట్లో 14,000 పరుగుల మైలురాయిని అధిగమించి, ఈ ఘనత సాధించిన ఐదో భారతీయ బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో రోహిత్ ఈ ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ఫామ్‌లో కనిపించిన అతను 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 123కు పైగా స్ట్రైక్ రేట్‌తో 48 పరుగులు చేశాడు. ప్రస్తుతం రోహిత్ పేరిట 356 లిస్ట్-A మ్యాచ్‌ల్లో 37 శతకాలతో కలిపి మొత్తం 14,038 పరుగులు ఉన్నాయి.
భారత్ తరఫున లిస్ట్-A క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (21,999 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత విరాట్ కోహ్లీ (16,447), సౌరవ్ గంగూలీ (15,622), రాహుల్ ద్రావిడ్ (15,271) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Also Read
- Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
- IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
- World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో 'గ్రూప్ ఆఫ్ డెత్'గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
- Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
మ్యాచ్ విషయానికి వస్తే..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే, భారత బ్యాటర్లు ఆఫ్ఘన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (110 బంతుల్లో 154 పరుగులు, 22 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (79 బంతుల్లో 125 పరుగులు, 14 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగి సెంచరీలు బాదారు. వీరి ధాటికి భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌట్ అయింది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నంగేయాలియా ఖరోటి 4 వికెట్లు, రషీద్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టారు. సిరీస్‌ను సమం చేయాలంటే ఆఫ్ఘనిస్తాన్ 403 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. ప్రస్తుతం ఆప్ఘనిస్తాన్ 30 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 168 రన్స్ చేసింది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..