భారత్ కు తొలి ఐసీసీ వరల్డ్ కప్ గెలిచిన జట్టులోని సభ్యులుగా ఉన్న ఎంఎస్ ధోని, రాబిన్ ఊతప్పలు మంచి స్నేహితులు. భారత జట్టుతో పాటు ఐపీఎల్ లో కూడా ఇద్దరు కలిసి ఆడారు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన ఊతప్ప గతేడాది ఐపీఎల్ ముగిసిన తర్వాత ఆటకు రిటైర్మింట్ ప్రకటించారు. రాబోయే సీజన్ లో ఊతప్ప ఐపీఎల్ కామెంటేటర్ అవతారం ఎత్తనున్నారు. జియో సినిమాస్ ద్వారా ప్రసారం కాబోతున్న ఐపీఎల్-16 ఊతప్ప కామెంటేటర్ గా చేస్తాడని హింట్స్ కూడా వచ్చాయి. తాజాగా అతడు జియో సినమాస్ లో జరిగిన చర్చలో సారథి ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Also Read : Spinach Juice: పాలకూర జ్యూస్ తాగితే.. ఈ సమస్యలన్నీ మటాష్
ఎంఎస్ ధోనీవి పదునైన వ్యూహాలు కలిగి ఉంటాడు.. అందుకే అతడిని అందరూ సక్సెస్ పుల్ కెప్టెన్ అంటారని ఊతప్ప అన్నారు. తన నుంచి వచ్చే ప్రతి నిర్ణయానికి అతడే బాధత్య వహిస్తాడని చెప్పాడు. అది విజయమైనా.. పరాజయమైనా ధోనినే పూర్తి బాధ్యత తీసుకునే వాడని తెలిపాడు. ఒకవేళ ధోని నిర్ణయం వల్ల ఫలితం ఏదైనా తేడా వస్తే అతడికి నిద్ర పట్టదు.. దానిమీదే ఆలోచిస్తూ గడుపుతుంటాడు.. ఒక విజయవంతమైన కెప్టెన్ తన తప్పుడు నిర్ణయాలపై నాలుగైదు సార్లు ఆలోచిస్తాడనుకుంటే ధోని మాత్రం.. కనీసం 8 నుంచి 9 సార్లు ఉంటుంది. అంత ఆలోస్తాడు కాబట్టే అతడు సక్సెస్ పుల్ సారథి అయ్యాడు.. అని ఊతప్ప చెప్పుకొచ్చాడు.
Also Read : Asaduddin Owaisi: సీఎం వల్లే ఆర్జేడీలోకి మా ఎమ్మెల్యేలు.. ఈ సారి ఎక్కువ స్థానాల్లో పోటీ..
కాగా మార్చ్ 31 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 16 సీజన్ కోసం ప్రస్తుతం చెన్నైలో ఎంఎస్ ధోనీ ప్రాక్టీస్ చేస్తున్నారు. అతనికి ఇదే చివరి సీజన్ అని వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి గతేడాదే ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాలని ధోని భావించినా పరిస్థితులు అందుకు అనుకూలించలేదు.. గత సీజన్ లో చెన్నై దారుణ ప్రదర్శనలతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ఈసారి తిరిగి పుంజుకోవాలని ధోని పట్టుదలతో ఉన్నాడు. తన చివరి మ్యాచ్ చెపాక్ (చెన్నై) లోనే ఆడతానని ధోని ఇది వరకే ప్రకటించారు. ఐపీఎల్ -16 చెన్నై తమ తొలి మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ తో తలపడనుంది.
