Site icon NTV Telugu

Rishabh Pant : ఐపీఎల్ లోకి నేనొస్తున్నాను.. ఇంత మోసం చేస్తావా.. రిషబ్ పంత్

Rishabh Pant

Rishabh Pant

అందరు ఆడుతున్నారు.. నేనెందుకు ఆడకూడదు.. నేనింకా గేమ్ లోనే ఉన్నా.. ఐపీఎల్ ఆడడానికి త్వరలోనే మీ ముందుకు వస్తున్నా.. అంటూ ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ రిషబ్ పంత్ వెల్లడించాడు. దీంతో పంత్ మాటలు విన్న అభిమానులు ఆనందపడిపోయారు. కానీ అది ప్రమోషనల్ వీడియో అని తెలియగానే అందరు చల్లబడ్డారు.

Also Read : Amit Shah: రాహుల్ అనర్హత వేటుపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ లేని లోటు తెలుస్తోంది. దీంతో అతనితో ప్రమోషనల్ వీడియో చేయాలని ఢిల్లీ క్యాపిటల్స్ అనుకుంది. అనుకుందే తడవుగా.. అతనితో వీడియో చేసి ట్విట్టర్ లో షేర్ చేసింది. ప్రస్తుతం పంత్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ వీడియో చూసిన అభిమానులు.. ఐపీఎల్ కు నువ్వు వస్తున్నావని తెగ సంతోష పడిపోయాం.. ఇంత మోసం చేస్తావా పంత్.. తొందరగా కోలుకో పంత్ పంటూ నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్వహించిన ప్రమోషనల్ వీడియోలో పంత్ మాట్లాడుతూ.. క్రికెట్ పుడ్.. ఈ రెండింటిని వదిలి నేు బతకలేను.. యాక్సిడెంట్ కారణంగా కొన్ని నెలలుగా క్రికెట్ ఆడలేకపోయాను.. ఇష్టమైన ఫుడ్ తినలేకపోయాను.. అయితే కాస్త కోలుకున్నాకా డాక్టర్ మంచిగా తింటే తొందరగా రికవరీ అవుతావన్నారు.. అందుకే ఆరోగ్యానికి మంచిదైన ఇంటిఫుడ్ ఎక్కువగా తీసుకున్నా.. క్రికెట్ సీజన్ ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నా.. ఎందుకు క్రికెట్ ఆడకూడదు అనిపించింది. అందరు ఆడుతున్నారు.. నేనెందుకు.. ఇంకా గేమ్ లోనే ఉన్న.. మ్యాచ్ లు ఆడడానికి వస్తున్నా అంటూ పేర్కొన్నాడు.

Also Read : Rohit Sharma : ఆందోళన ఎందుకు.. ఎలా ఆడాలో మాకు తెలుసు..

గతేడాది డిసెంబర్ లో రిషబ్ పంత్ కు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీ నుంచి లక్నో వస్తుండగా రూర్కీ సమీపంలో కారు అదుపు తప్పి పల్టీలు కొట్టడంతో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. పలు సర్జరీల అనంతరం పంత్ కోలుకుంటున్నాడు. ఫలితంగా దాదాపు తొమ్మిది నెలలు క్రికెట్ కు దూరమయ్యాడు. అయితే వేగంగానే కోలుకుంటుండడంతో అనుకున్న దాని కంటే ముందుగానే మైదానంలో రిషబ్ పంత్ అడుగుపెడతాని ధీమా వ్యక్తం చేశాడు. ఇక యాక్సిడెంట్ తో ఐపీఎల్ తో పాటు వన్డే ప్రపంచకప్ కు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఐపీఎల్ కు దూరం కావడంతో పంత్ సేవలను ఢిల్లీ క్యాపిటల్స్ కోల్పోయింది. పంత్ స్థానంలో డేవిడ్ వార్నర్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఐపీఎల్ లో కెప్టెన్ గా వార్నర్ కు అనుభవంతో పాటు మంచి పేరు ఉంది. ఇక పంత్ స్థానంలో అభిషేక్ పోరెల్ ను ఎంపిక చేసినట్లు ఢిల్లీ క్యాపిటల్స్ తెలిపింది. ఏప్రిల్ ఒకటిన లక్నో సూపర్ జెయింట్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తన మొదటి మ్యాచ్ ఆడనుంది.

Exit mobile version