Rishabh Pant: ఆ పొరపాటు వల్లే ఓడిపోయాం.. హ్యాట్రిక్ తప్పకుండా కొడతాం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారీ స్కోరు చేసినా తొలి టీ20 మ్యాచ్ ఓడిపోవడంతో.. రెండో మ్యాచ్ నెగ్గి దక్షిణాఫ్రికాపై భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ, ఈసారి బ్యాట్స్మన్లు చేతులెత్తేయడంతో ఓటమి చవిచూడక తప్పలేదు. దీంతో.. ఐదు మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లో దఫ్రికాఫ్రికా 2-0తో ఆధిక్యంలో ఉంది. ప్రత్యర్థి జట్టు బ్యాట్స్మన్లను కట్టడి చేసేందుకు భారత బౌలర్లు చివరివరకూ ప్రయత్నించారు కానీ, ప్రయోజనం లేకుండా పోయింది. అయితే, రిషభ్ పంత్ మాత్రం మరింత మెరుగ్గా బౌలింగ్ వేసుంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. రెండో అర్థభాగంలో మెరుగ్గా బౌలింగ్ వేసి, వికెట్లు తీసి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు.
‘‘మొదటి 7-8 ఓవర్లలో భువీ, ఇతర ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. కానీ, ఆ తర్వాతే మేము రాణించలేకపోయాం. రెండో భాగంలో వికెట్లు తీయాల్సిన ఆవశ్యకత ఉన్న తరుణంలో తేలిపోయాం. మేము ఇంకాస్త మెరుగ్గా బౌలింగ్ చేసి ఉంటే ఫలితం వేరుగా ఉండేదేమో! క్లాసెన్, బవుమా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. బ్యాటింగ్ పరంగానూ మేము మరింత రాణించి ఉండాల్సింది. మరో 10-15 పరుగులు ఎక్కువ చేసి ఉంటే.. మ్యాచ్ మనదే అయ్యుండేది. ఇప్పుడు మేము మిగిలిన మూడు మ్యాచ్‌లు తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. హ్యాట్రిక్ కొట్టేందుకు ప్రయత్నిస్తాం’’ అని పంత్ చెప్పుకొచ్చాడు. తదుపరి మ్యాచ్ నుంచి తప్పులు దిద్దుకొని, తప్పకుండా గెలిచేందుకు సత్తా చాటుతామని అన్నాడు.
Also Read
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
- Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
రెండో టీ20 మ్యాచ్ ఫలితాలు:
* టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
* భారత్ స్కోరు: 148/6 (20)
* దక్షిణాఫ్రికా స్కోరు: 149/6 (18.2)
* 4 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది
* ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: హెన్రిచ్ క్లాసెన్ (46 బంతుల్లో 81 పరుగులు)
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!