Team India: బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌కు వికెట్ కీపర్ రిషబ్ పంత్ దూరమయ్యాడు. ఇటీవల పంత్ ఫామ్ దృష్ట్యా అతడిని ఈ సిరీస్ నుంచి దూరం చేస్తారని మొదట్నుంచీ డిస్కషన్ నడుస్తూనే ఉంది. అయితే తొలి వన్డేలో పంత్‌ను పక్కనపెట్టడంపై బీసీసీఐ వివరణ ఇచ్చింది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో పంత్ గాయపడ్డాడని, మెడికల్ టీమ్ సూచనలతో అతన్ని వన్డే సిరీస్ నుంచి తప్పించినట్లు బీసీసీఐ పేర్కొంది. టెస్ట్ సిరీస్‌కు మాత్రం పంత్ అందుబాటులోకి వస్తాడని బీసీసీఐ వివరించింది. అతడికి రిప్లేస్‌మెంట్‌గా ఎవరి పేరు ప్రకటించలేదని తెలిపింది. అటు గాయంతో ఇబ్బంది పడుతున్న అక్షర్ పటేల్ కూడా తొలి వన్డే సెలెక్షన్‌కు అందుబాటులో లేడని బీసీసీఐ పేర్కొంది.
Read Also: YSRCP: బావ, బావమరిది మధ్యలో మామ.. వైసీపీ ఎమ్మెల్యే ఇంట్లో ఆస్తి గొడవలు
అయితే పంత్ విషయంలో బీసీసీఐ ప్రకటన వివాదాస్పదంగా మారింది. కావాలనే పంత్‌ను తప్పించారని.. కానీ బీసీసీఐ తన చర్యను సమర్ధించుకోవడానికి కట్టుకథలు అల్లుతోందని నెటిజన్‌లు అభిప్రాయపడుతున్నారు. అటు గాయాలతో స్టార్ ఆటగాళ్లు దూరమైన నేపథ్యంలోనే నలుగురు ఆల్‌రౌండర్లను తీసుకున్నామని రోహిత్ శర్మ టాస్ సందర్భంగా స్పష్టం చేశాడు. వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, షెహ్‌బాజ్ అహ్మద్, దీపక్ చాహర్ జట్టులోకి వచ్చారని తెలిపాడు. పంత్‌కు గాయం కావడంతో అతడు ఈ సిరీస్‌కు దూరమయ్యాడని వివరించాడు. న్యూజిలాండ్‌లో ఆడిన కొన్ని మ్యాచ్‌ల్లో తమ కుర్రాళ్లు అద్భుతంగా పోరాడారని.. కొందరైతే అత్యద్భుతంగా బ్యాటింగ్ చేశారని రోహిత్ ప్రశంసించాడు. వన్డే వరల్డ్ కప్‌కు చాలా సమయం ఉందని.. దాని గురించి ఇప్పుడే ఆలోచించడం లేదన్నాడు. తమకు ఉన్న వనరులను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపైనే ఫోకస్ పెట్టామని రోహిత్ చెప్పాడు.