Rishab Pant: రిషబ్ పంత్ ఆరోగ్యంపై బులెటిన్ విడుదల చేసిన వైద్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishab Pant: టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డుప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతడు గాయాలతో డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ ఆరోగ్యంపై వైద్యులు తొలి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జన్ల పర్యవేక్షణలో క్రికెటర్ రిషబ్ పంత్ ఉన్నాడని.. అతడి కండిషన్ నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. పరీక్షలన్నీ ముగిసిన తర్వాత పూర్థిస్థాయి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని మ్యాక్స్ హాస్పిటల్ డాక్టర్ ఆశిష్ యాగ్నిక్ ప్రకటించారు.
Read Also: Vande Bharat Express: బాధలోనూ కర్తవ్యాన్ని మరవని ప్రధాని.. వందేభారత్ రైలు ప్రారంభం
Also Read
- Shreyas Iyer: నేనింతే.. ఎవరి కోసం నేను మారను.. సర్పంచ్ సాబ్ సంచలన వ్యాఖ్యలు!
- Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్‌తో 'జై షా' కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
- IND vs AFG Test: షాకింగ్.. మూఢనమ్మకంతో స్టేడియం నుంచి వెళ్లిపోయిన టీమిండియా క్రికెటర్ ఫ్యామిలీ!
- Shubman Gill History: చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్.. భారత క్రికెట్ చరిత్రలోనే మొదటి కెప్టెన్!
కాగా శుక్రవారం ఉదయం రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు డివైడర్ రెయిలింగ్‌ను ఢీకొని అగ్నికి ఆహుతి అయ్యింది. కారు డోర్ విండోను బద్దలు కొట్టుకుని రిషబ్ పంత్ ప్రాణాలతో బయటపడగా తీవ్ర గాయాల పాలయ్యాడు. తలపై గాయాలు, మోకాలి లిగమెంట్ తెగిపోవడం, వీపు భాగంలో కాలడం జరిగింది. ఢిల్లీకి వెళ్తుండగా రూర్కీ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పంత్ ఆరోగ్యం మెరుగవ్వాలని క్రికెటర్లు, అభిమానులు కోరుకుంటున్నారు. పంత్ త్వరగా కోలుకోవాలని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆకాంక్ష వ్యక్తం చేశాడు. అటు నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా ట్విట్టర్‌లో స్పందించాడు. రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని.. అదృష్టం కొద్దీ అతడు ప్రాణ ప్రమాదం నుంచి బయటపడ్డాడని పేర్కొన్నాడు. మరోవైపు పంత్ కారు మంటల్లో దగ్ధమవుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు కారులో నుంచి పంత్ దూకకపోతే ప్రాణనష్టం జరిగేదని అభిప్రాయపడుతున్నారు.
Rishab Pant, Car accident, Pant Health, Team india, cricket news
తాజావార్తలు
-
Suryakumar Yadav-MI: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్‌బై?.. ఇదే ప్రూఫ్!
-
Ram Gopal Varma : పెద్ద స్లార్లకు, భారీ బడ్జెట్ డైరెక్టర్లకు RGV కౌంటర్… హాలీవుడ్ హారర్ పై వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Ram Charan : ‘పెద్ది’ని చూసి రామ్ చరణ్ ఎమోషనల్… వీడియో వైరల్
-
Today Gold and Silver Prices: బంగారం కొనాలనుకుంటున్నారా? తాజా గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవిగో.. తగ్గాయా? పెరిగాయా?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!