NTV Telugu Site icon

Rishab Pant: రిషబ్ పంత్ ఆరోగ్యంపై బులెటిన్ విడుదల చేసిన వైద్యులు

Rishab Pant

Rishab Pant

Rishab Pant: టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డుప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతడు గాయాలతో డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ ఆరోగ్యంపై వైద్యులు తొలి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జన్ల పర్యవేక్షణలో క్రికెటర్ రిషబ్ పంత్ ఉన్నాడని.. అతడి కండిషన్ నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. పరీక్షలన్నీ ముగిసిన తర్వాత పూర్థిస్థాయి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని మ్యాక్స్ హాస్పిటల్ డాక్టర్ ఆశిష్ యాగ్నిక్ ప్రకటించారు.

Read Also: Vande Bharat Express: బాధలోనూ కర్తవ్యాన్ని మరవని ప్రధాని.. వందేభారత్‌ రైలు ప్రారంభం

కాగా శుక్రవారం ఉదయం రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు డివైడర్ రెయిలింగ్‌ను ఢీకొని అగ్నికి ఆహుతి అయ్యింది. కారు డోర్ విండోను బద్దలు కొట్టుకుని రిషబ్ పంత్ ప్రాణాలతో బయటపడగా తీవ్ర గాయాల పాలయ్యాడు. తలపై గాయాలు, మోకాలి లిగమెంట్ తెగిపోవడం, వీపు భాగంలో కాలడం జరిగింది. ఢిల్లీకి వెళ్తుండగా రూర్కీ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పంత్ ఆరోగ్యం మెరుగవ్వాలని క్రికెటర్లు, అభిమానులు కోరుకుంటున్నారు. పంత్ త్వరగా కోలుకోవాలని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆకాంక్ష వ్యక్తం చేశాడు. అటు నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా ట్విట్టర్‌లో స్పందించాడు. రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని.. అదృష్టం కొద్దీ అతడు ప్రాణ ప్రమాదం నుంచి బయటపడ్డాడని పేర్కొన్నాడు. మరోవైపు పంత్ కారు మంటల్లో దగ్ధమవుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు కారులో నుంచి పంత్ దూకకపోతే ప్రాణనష్టం జరిగేదని అభిప్రాయపడుతున్నారు.

Rishab Pant, Car accident, Pant Health, Team india, cricket news