NTV Telugu Site icon

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో అడుగు పెట్టేది ఈ రెండు జట్లే.. పాక్‌తో మాత్రం జాగ్రత్త..!

Champions

Champions

Champions Trophy 2025: ఈ నెల 19వ తేదీ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ కానుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ పాకిస్థాన్‌ ఆతిథ్య హోదాలో బరిలోకి దిగుతుండగా.. ఈసారి ఎవరు విజేతగా నిలవనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఐసీసీ రివ్యూ ఎపిసోడ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనలిస్టులు ఎవరనే దానిపై విశ్లేషణ చేశాడు. ఈ సందర్భంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లోకి భారత్, ఆస్ట్రేలియా అడుగు పెడతాయని చెప్పుకొచ్చాడు. ఈ రెండు టీమ్స్ ఇప్పటికే చెరో రెండు సార్లు ఈ ట్రోఫీని దక్కించుకున్నాయని రిక్కీ పాటింగ్ అన్నారు.

Read Also: February Release Dates: ఫిబ్రవరి రిలీజ్ డేట్లలో మార్పులు.. ఎప్పుడెప్పుడు ఏయే సినిమాలంటే?

అయితే, ఇప్పటికే ఇరు జట్లు ప్లేయర్ల ప్రదర్శన కూడా అద్భుతంగా ఉండటంతో.. పాటు వీరికి పోటీగా మరో జట్టు కూడా రేసులో నిలిచే ఛాన్స్ ఉందని ఆసీస్ మాజీ సారథి రిక్కీ పాటింగ్ పేర్కొన్నారు. సొంత మైదానాల్లో ఆడబోయే పాకిస్థాన్‌ నుంచి ప్రత్యర్థులకు సవాల్‌ విసురుతుందని చెప్పారు. అంచనాలకు దొరకకుండా ఆ జట్టు ప్రదర్శన చేస్తుంది.. పెద్ద టోర్నీల్లో ఆ టీమ్ ను ఎప్పుడు తక్కువగా వేయకూడదని పాంటింగ్ వ్యాఖ్యానించాగా.. అతడి కామెంట్స్ కు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రీ కూడా అంగీకరించాడు.

Read Also: Anirudh: నాని ‘ప్యారడైజ్’ కోసం అనిరుధ్ షాకింగ్ రెమ్యునరేషన్”?

కాగా, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్‌ చాలా ఆలస్యంగా తమ జట్టును ప్రకటించింది. కానీ, జట్టు సెలక్షన్ పై ఆ జట్టు మాజీ క్రికెటర్ వసీమ్‌ అక్రమ్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక్క స్పిన్నర్‌కే ఛాన్స్ ఇవ్వడంపైనా విమర్శలు కురిపించాడు. టీమిండియా నలుగురు స్పీన్నర్లను తీసుకున్నట్లు గుర్తు చేయగా.. పాక్ కేవలం ఫహీమ్ అష్రఫ్‌ను మాత్రమే తీసుకున్నారని తెలిపాడు. గత కొన్ని నెలలుగా అతడి బ్యాటింగ్‌ సగటు 8, బౌలింగ్ యావరేజీ 100, మరో ఆల్‌రౌండర్ ఖుష్దిల్ షా ప్రదర్శనా అంత గొప్పగా లేదని వసీమ్‌ అక్రమ్ వ్యాఖ్యానించాడు.