NTV Telugu Site icon

ఐపీఎల్ పై కన్నేసిన రిలయన్స్‌…

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ప్రసార హక్కులపై రిలయన్స్‌ కన్నేసిందా ? డిసెంబర్‌లో జరిగే బిడ్డింగ్‌లో పాల్గొని…బ్రాడ్‌కాస్టింగ్‌ రైట్స్‌ దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందా ? ఇప్పటికే అందుకు కావాల్సిన మ్యాన్‌ పవర్‌ను సిద్ధంగా చేసిందా

ఇండియాలో…ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఐపీఎల్‌ ప్రారంభమవుతుందంటే….ప్రధాన నగరాల్లో ఉండే ఆ జోష్‌ వేరు. షెడ్యూల్‌ వచ్చింది మొదలు…సీజన్‌ ముగిసే వరకు…క్రికెట్‌ ఫ్యాన్స్‌కు మ్యాచ్‌ల గురించే చర్చ. అభిమానుల ఆసక్తిని క్యాష్‌ చేసుకునేందుకు…రిలయన్స్‌ సంస్థ పెద్ద ప్రణాళికే రచించింది. ముంబై ఇండియన్స్‌ను కొనుగోలు చేసి…క్రీడారంగంలోకి ప్రవేశించింది. తాజాగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌…ప్రసార హక్కులపై కన్నేసింది.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ప్రసార హక్కులు దక్కించుకొనేందుకు రిలయన్స్‌ భారీ ప్రణాళికతో రానుందని తెలిసింది. ఇప్పటికే ప్రత్యర్థి బ్రాడ్‌కాస్టింగ్‌ సంస్థల నుంచి సీనియర్లను తీసుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఆఖర్లో నిర్వహించే ఐపీఎల్‌ బిడ్డింగ్‌లో పాల్గొని…ప్రసార హక్కులను ఎలాగైనా గెలుచుకోవాలని పట్టుదలతో ఉంది. ఐపీఎల్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ను స్టార్‌స్పోర్ట్స్‌ ఐదేళ్ల పాటు కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. ఈ ఏడాదితో ఐపీఎల్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ కాంట్రాక్ట్‌ ముగియనుంది. దీంతో ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. నెట్‌వర్క్‌ గ్రూప్‌-18, రిలయన్స్‌ జియో భాగస్వామ్యంతో ఐపీఎల్‌ మ్యాచ్‌లను బ్రాడ్‌ కాస్టింగ్‌ హక్కులను పొందాలని రిలయన్స్‌ భావిస్తోంది.

ప్రస్తుతం ఐపీఎల్‌ ప్రసార హక్కులు డిస్నీ స్టార్‌ ఇండియా వద్ద ఉన్నాయి. 2022తో ఒప్పందం ముగుస్తుంది. బిడ్డింగ్స్‌ ద్వారా కొత్త ప్రక్రియ ఈ ఏడాది ఆఖర్లో ఆరంభమవుతుంది. డిస్నీ స్టార్‌, సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్‌, అమెజాన్‌ ఇండియా సైతం హక్కుల కోసం భారీ స్థాయిలో పోటీ పడనున్నాయి. రిలయన్స్‌ నుంచి సరికొత్త క్రీడా ఛానల్‌ రాబోతోందని ఈ4ఎం చెబుతోంది. ఇప్పటికే ఫుట్‌బాల్‌ లీగ్‌ ‘లా లిగా’ ప్రసార హక్కుల్లో వయాకామ్‌ మెజారిటీ వాటా దక్కించుకొందని గుర్తు చేస్తోంది.

IPL 2021: Reliance planning big entry into sports-broadcasting, may bid for IPL rights | NTV Sports