RCB vs SRH: చిన్నస్వామిలో చరిత్ర.. ఆర్‌సీబీ vs ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌కు రికార్డు వ్యూస్!

  • ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లోనే రికార్డుల వర్షం
  • మైదానంలోనే కాదు డిజిటల్ ప్రపంచంలో కూడా సంచలనం
  • ఆర్‌సీబీ vs ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌కు రికార్డు వ్యూస్
Virat Kohli RCB vs SRH

Virat Kohli RCB vs SRH

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ తొలి మ్యాచ్‌లోనే రికార్డుల వర్షం కురిసింది. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) మ్యాచ్ కేవలం మైదానంలోనే కాదు.. డిజిటల్ ప్రపంచంలో కూడా సంచలనం సృష్టించింది. ఈ మ్యాచ్ జియో హాట్‌స్టార్‌లో 43.1 మిలియన్ వ్యూస్ సాధించి.. ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా వీక్షించిన రెండో మ్యాచ్‌గా నిలిచింది.

ఇన్ని వ్యూస్ రావడానికి కారణం ఆర్‌సీబీ మ్యాచ్‌లకు ఉన్న భారీ ఫ్యాన్ బేస్ అనే చెప్పాలి. ఐపీఎల్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన మ్యాచ్ కూడా ఆర్‌సీబీదే కావడం గమనార్హం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs పంజాబ్ కింగ్స్ మ్యాచ్ 89.3 మిలియన్ వ్యూస్‌తో అగ్రస్థానంలో ఉండగా.. ఇప్పుడు ఆర్‌సీబీ vs ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. మూడో స్థానంలో బెంగళూరు vs కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ 41.7 మిలియన్ వ్యూస్‌తో ఉంది.

Also Read: Virat Kohli: ఒకే ఫార్మాట్ ఎందుకు.. అసలు రహస్యాన్ని వెల్లడించిన విరాట్ కోహ్లీ!

ఈ గణాంకాలు చూస్తే ఆర్‌సీబీ జట్టుకు ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ వంటి స్టార్ ప్లేయర్ ఉండటం కూడా ప్రేక్షకులను ఆకర్షించే ప్రధాన కారణంగా చెప్పాలి. తాజా మ్యాచ్‌లో కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడటం, జట్టుకు విజయం అందించడం కూడా వ్యూస్ పెరగడానికి కారణమైంది. ఐపీఎల్ 2026 ప్రారంభమే ఇంత భారీ రికార్డులతో మొదలవడం లీగ్‌కు మరింత హైప్ తీసుకొచ్చింది. ఇక ముందున్న మ్యాచ్‌లు ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడతాయో చూడాలి.