RCB vs SRH: చిన్నస్వామిలో చరిత్ర.. ఆర్‌సీబీ vs ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌కు రికార్డు వ్యూస్!
- ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లోనే రికార్డుల వర్షం
- మైదానంలోనే కాదు డిజిటల్ ప్రపంచంలో కూడా సంచలనం
- ఆర్‌సీబీ vs ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌కు రికార్డు వ్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ తొలి మ్యాచ్‌లోనే రికార్డుల వర్షం కురిసింది. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మ్యాచ్ కేవలం మైదానంలోనే కాదు.. డిజిటల్ ప్రపంచంలో కూడా సంచలనం సృష్టించింది. ఈ మ్యాచ్ జియో హాట్‌స్టార్‌లో 43.1 మిలియన్ వ్యూస్ సాధించి.. ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా వీక్షించిన రెండో మ్యాచ్‌గా నిలిచింది.
ఇన్ని వ్యూస్ రావడానికి కారణం ఆర్‌సీబీ మ్యాచ్‌లకు ఉన్న భారీ ఫ్యాన్ బేస్ అనే చెప్పాలి. ఐపీఎల్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన మ్యాచ్ కూడా ఆర్‌సీబీదే కావడం గమనార్హం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs పంజాబ్ కింగ్స్ మ్యాచ్ 89.3 మిలియన్ వ్యూస్‌తో అగ్రస్థానంలో ఉండగా.. ఇప్పుడు ఆర్‌సీబీ vs ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. మూడో స్థానంలో బెంగళూరు vs కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ 41.7 మిలియన్ వ్యూస్‌తో ఉంది.
Also Read
- Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
- IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
- World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో 'గ్రూప్ ఆఫ్ డెత్'గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
- Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
Also Read: Virat Kohli: ఒకే ఫార్మాట్ ఎందుకు.. అసలు రహస్యాన్ని వెల్లడించిన విరాట్ కోహ్లీ!
ఈ గణాంకాలు చూస్తే ఆర్‌సీబీ జట్టుకు ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ వంటి స్టార్ ప్లేయర్ ఉండటం కూడా ప్రేక్షకులను ఆకర్షించే ప్రధాన కారణంగా చెప్పాలి. తాజా మ్యాచ్‌లో కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడటం, జట్టుకు విజయం అందించడం కూడా వ్యూస్ పెరగడానికి కారణమైంది. ఐపీఎల్ 2026 ప్రారంభమే ఇంత భారీ రికార్డులతో మొదలవడం లీగ్‌కు మరింత హైప్ తీసుకొచ్చింది. ఇక ముందున్న మ్యాచ్‌లు ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడతాయో చూడాలి.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..