ఐపీఎల్ 2022 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఈ సీజన్‌లో నువ్వా నేనా అనే విధంగా జట్లు పోటీ పడుతున్నాయి. అయితే ఈ సీజన్‌లో భాగంగా నేడు ఆసక్తికర పోరు జరుగుతోంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో లక్నో సూపర్ జెయింట్ తలపడుతోంది. అయితే టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ ఎంచుకోగా రాయల్ ఛాలెంజర్స్ ఆటగాళ్లు బ్యాటింగ్‌కు దిగారు.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఇరుజట్లు చెరో 6 మ్యాచ్‌లు ఆడి నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి సమానంగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక ఆటగాడు దినేశ్ కార్తీక్ మరో 45 పరుగులు చేస్తే ఐపీఎల్‌లో 4000 పరుగుల మార్కును చేరుకుంటాడు. అలాగే నేటి మ్యాచ్‌లో కార్తీక్ మరో 3 బౌండరీలు సాధిస్తే, ఐపీఎల్‌లో 400 ఫోర్లు బాదిన క్రికెటర్ల క్లబ్‌లో చేరతాడు.