Site icon NTV Telugu

Jitesh Sharma: ఆర్మీ కాదని క్రికెటర్‌గా.. జితేష్ శర్మ బ్యాగ్రౌండ్ ఇదే!

Jiteshsharma

Jiteshsharma

పంజాబ్ ప్లేయర్ జితేష్ శర్మను ఆర్సీబీ మెగ వేలంలో రూ.11 కోట్లకు దక్కించుకుంది. అప్పుడు అర్ధం కాలేదు. జితేష్ కెప్టెన్సీలో ఆర్సీబీ క్వాలిఫయర్ వన్‌కి చేరుతుందని. లక్నోపై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి అంచున ఉండగా.. ఇన్నింగ్స్ బాధ్యతను తీసుకున్నాడు. ఆరంభం నుంచి ధాటిగా ఆడటం మొదలుపెట్టాడు. మయాంక్ అగర్వాల్‌తో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఎడాపెడా బాదుతూ పరుగుల వరద పారించాడు. జితేష్ వీరబాదుడికి ఆర్సీబీ ఊపిరిపీల్చుకుంది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో విజయం ఆర్సీబీకి సలాం కొట్టింది. దీంతో జితేష్ శర్మ ఒక్కసారిగా హెడ్ లైన్స్ లో నిలిచాడు.

ఇది కూడా చదవండి: Randhir Jaiswal: ఉగ్రవాదం, చర్చలు కలిసి సాగవు.. మరోసారి పాక్‌కు తేల్చిచెప్పిన భారత్

అతని గురించి తెలుసుకోవాలని ఫ్యాన్స్ గూగుల్‌ని ఆశ్రయిస్తున్నారు. జితేష్ శర్మ 1993లో మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించాడు. చిన్నప్పటి నుంచి క్రికెటర్ కావాలని కలలు కన్నాడు. మధ్యతరగతి కుటుంబం కావడంతో క్రికెట్‌ని పక్కనపెట్టి ఇండియన్ మిలిటరీ సర్వీసెస్‌లో చేరాలనుకున్నాడు. కానీ తండ్రి పట్టుబట్టి క్రికెటర్‌ని చేయాలనుకున్నాడు. సోదరుడి క్రికెట్ అకాడమీలో చేర్పించాడు. అలా జితేష్ ఆర్మీ ఆఫీసర్ కావల్సినోడు క్రికెటర్ అయ్యాడు. ఈ జర్నీలో ఎన్నో కష్టాలు పడ్డాడు. ఫ్యామిలీ ఫైనాల్సియాల్‌గా ఇబ్బంది పడుతుండటం చూసి ఒక దశలో క్రికెట్‌ని వదిలేద్దాం అనుకున్నాడు. కానీ తండ్రి ఆశయం అతన్ని ముందుకు నడిపించింది. అలా అంచలంచెలుగా ఎదుగుతూ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు.

ఇది కూడా చదవండి: YS Jagan: వైఎస్ రాజారెడ్డి శత జయంతి వేడుకల్లో పాల్గొన్న జగన్ కుటుంబ సభ్యులు..

మొదట పంజాబ్ కింగ్స్ తరపున ఆడాడు. గత వేలంలో ఆర్సీబీ జితేష్‌ను రూ.11 కోట్లతో దక్కించుకుంది. రజిత్ పాటిదార్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకుని, ఇప్పుడు మ్యాచ్ విన్నర్ గా మారాడు. లక్నోపై అతనెంత కాస్ట్లీ ఇన్నింగ్స్ ఆడాడో త్వరలో అర్ధమవుతుంది. ఒకవేళ ఆర్సీబీ ఫైనల్ ఆడితే ఆ క్రెడిట్ కచ్చితంగా జితేష్ కే చెందుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే వెంటిలేటర్‌పై ఉన్న ఆర్సీబీకి ఊపిరి పోసి కాపాడాడు.

Exit mobile version