Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International Sports Ravi Shastri On Praises Ms Dhoni Over Lbw

Ravi Shastri: ఆ విషయంలో ధోనీనే బెస్ట్

Published Date :September 22, 2022 , 11:06 am
By NTV WebDesk
Ravi Shastri: ఆ విషయంలో ధోనీనే బెస్ట్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ravi Shastri On Praises MS Dhoni Over LBW: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఎంత ఘోర పరాజయం చవిచూసిందో అందరికీ తెలుసు. బ్యాటింగ్‌లో అదరగొట్టినా.. బౌలింగ్‌లో మాత్రం విఫలం కావడంతో ఓటమి పాలైంది. ఫీల్డింగ్‌లో కూడా చాలా తప్పిదాలు జరిగాయి. దానికితోడు.. ఓ ఎల్‌బీడబ్ల్యూ అవకాశాన్ని ఆటగాళ్లు గుర్తించకపోవడం కూడా జట్టు ఓటమికి కారణమైంది. బహుశా అది గుర్తించి ఉండుంటే, అప్పుడు మ్యాచ్ ఫలితాలు మరోలా ఉండేవని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఇదే విషయంపై తాజాగా రవిశాస్త్రి స్పందిస్తూ.. అలాంటి ఎల్‌బీడబ్ల్యూ అవకాశాల్ని గుర్తించడంలో టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని ఉత్తముడని కొనియాడారు. ‘‘ఇలాంటి ఎల్‌బీడబ్ల్యూ విషయంలోనే వికెట్ కీపర్లు అత్యంత కీలకమైన పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఎంఎస్ ధోనీ ఉత్తమంగా వ్యవహరించేవాడు’’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చారు.

ఇకపోతే.. తొలి మ్యాచ్‌లో 208 పరుగులు చేసిన టీమిండియా, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడానికి పేలవ బౌలింగ్ ప్రదర్శనతో పాటు మిస్ ఫీల్డ్స్ చేయడం ప్రధాన కారణాలు. ఓపెనర్‌గా వచ్చిన కామరూన్ గ్రీన్ 5వ ఓవర్లోనే ఔట్ అయ్యేవాడు. ఓ ఓవర్‌లో చాహల్ వేసిన ఐదో బంతి అతడి ప్యాడ్‌కు తాకింది. కానీ, భారత్ వైపు నుంచి ఎవ్వరూ అప్పీల్ చేయలేదు. ఆ తర్వాత అది ఎల్‌బీడబ్ల్యూగా తేలింది. దీంతో అందరూ ఒకరి మొహాలు మరొకరు చూసుకున్నారు. అలా లైఫ్ రావడంతో.. గ్రీన్ చెలరేగిపోయి ఆడాడు. 30 బంతుల్లోనే 61 పరుగులు చేసి, ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా.. శుక్రవారం ఆసీస్, భారత్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇది భారత్‌కి అత్యంత కీలకమైన మ్యాచ్. ఇందులో గెలిస్తేనే.. సిరీస్ గెలిచే అవకాశాలు ఉంటాయి. లేదంటే, చేజారినట్టే!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Cameron Green
  • ind vs aus
  • India vs Australia
  • ms dhoni
  • ravi shastri

తాజావార్తలు

  • Aditya Dhar: అతను నాకు తమ్ముడు లాంటి వాడు.. శాశ్వత్ సచ్‌దేవ్‌పై ఆదిత్య ధర్ ప్రశంసలు!

  • No Traffic Lights Country: ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం.. ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న ఆ కంట్రీ ఏదంటే..?

  • Water Bottle Cleaning Tips: ప్లాస్టిక్ బాటిల్స్‌ ఫ్రిజ్‌లో పెడుతున్నారా..? అయితే ఇది మీ కోసమే..!

  • Israel: భారీ దాడులకు సిద్ధమైన ఇజ్రాయిల్.. ట్రైన్ నెట్‌వర్క్ టార్గెట్‌గా అటాక్స్..

  • AA 22 : లవ్ లెటర్ లోడింగ్.. ప్రీ లుక్‌తోనే ప్రభంజనం

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions