NTV Telugu Site icon

Rashid Khan: రషీద్ ఖాన్ వరల్డ్ రికార్డ్.. టీ20లోనే అగ్రస్థానం

Rashid Khan World Record

Rashid Khan World Record

Rashid Khan Creates World Record: ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న ఆఫ్ఘనిస్తాన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ తాజాగా అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక సార్లు హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ నమోదు చేయడంతో.. అతడు ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో రషీద్‌కి ఇది తొలి హ్యాట్రిక్ కాగా.. ఓవరాల్ టీ20లో మాత్రం నాల్గవది. ఈ జాబితాలో రషీద్ తర్వాత అండ్రూ టై, మహ్మద్‌ షమీ, అమిత్‌ మిశ్రా, రస్సెల్‌, తహీర్‌ ఉన్నారు. వీరిందరూ ఇప్పటివరకు టీ20 క్రికెట్‌లో మూడు సార్లు హ్యాట్రిక్‌ వికెట్లు పడగొట్టారు.

Amit Shah: చైనాకు అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్.. ఒక్క అంగుళం కూడా తీసుకోలేరు

కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ తీసిన హ్యాట్రిక్ గురించి మాట్లాడితే.. తొలుత ఇతడు ఆండ్రూ రసెల్ వికెట్ పడగొట్టాడు. మొదట ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వలేదు కానీ, రివ్యూ తీసుకున్నాక అల్ట్రా ఎడ్జ్‌లో బ్యాట్‌కు బంతి తాకినట్టు తేలింది. దీంతో.. దాన్ని ఔట్‌గా ఖరారు చేశారు. అనంతరం సునీల్ నరైన్ భారీ షాట్ కొట్టబోగా.. అది నేరుగా ఫీల్డర్ చేతిలో క్యాచ్‌గా చేరింది. ఇక శార్దూల్ ఠాకూర్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. రషీద్ వేసిన బంతి అంచనాలకు అందని విధంగా స్వింగ్ అవ్వడంతో.. అది బ్యాట్‌కు బదులు ప్యాడ్స్‌ను తాకింది. తద్వారా అతడు ఔట్ అయ్యాడు. రివ్యూ తీసుకున్నా.. అది ఔట్‌గా తేలడంతో, కేకేఆర్ ఒక రివ్యూ కోల్పోవాల్సి వచ్చింది. ఇలా రషీద్ వరుసగా మూడు వికెట్లు పడగొట్టి, ఈ ఐపీఎల్‌లో తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు.

Kolkata Knight Riders: కేకేఆర్ చారిత్రాత్మక రికార్డ్.. 16 ఏళ్లలో ఇదే తొలిసారి

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (53), విజయ్ శంకర్ (63) అర్థశతకాలతో రప్ఫాడించడంతో, గుజరాత్ అంత భారీ స్కోరు చేయగలిగింది. ఇక 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్.. 207 పరుగులు చేసి విజయం సాధించింది. చివరి ఓవర్‌లో ఐదు బంతుల్లో 28 పరుగులు చేయాల్సి ఉండగా.. మ్యాచ్ గుజరాత్‌దేనని దాదాపు అంతా ఫిక్సయ్యారు. కానీ.. ఊహించని విధంగా రింకూ సింగ్ ఐదు సిక్సులు బాది, కేకేఆర్ జట్టుకి చారిత్రాత్మక విజయాన్ని అందించాడు.