NTV Telugu Site icon

RR vs GT: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న రాజస్థాన్ రాయల్స్

Rr Vs Gt

Rr Vs Gt

Rajasthan Royals Won The Toss And Chose To Bat Against GT: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా శుక్రవారం రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ ఇండోర్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. ఆర్ఆర్ టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. ఆల్రెడీ ఈ ఇరుజట్ల మధ్య ఒక మ్యాచ్ జరిగింది. అందులో.. జీటీ నిర్దేశించిన (178) లక్ష్యాన్ని ఛేధించి, ఆర్ఆర్ (179) జట్టు గెలుపొందింది. ఇప్పుడు అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని గుజరాత్ భావిస్తోంది. పైగా.. డీసీతో జరిగిన మ్యాచ్‌లోనూ జీటీ ఓటమిపాలైంది. 131 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేధించలేక చతికిలపడింది. ఆ అవమానభారం నుంచి బయటపడేందుకు.. ఆర్ఆర్‌పై ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలని జీటీ చూస్తోంది. అటు.. రాజస్థాన్ కూడా ఈ మ్యాచ్ నెగ్గాలని భావిస్తోంది. గత మ్యాచ్‌లో ముంబై చేతిలో ఓటమిపాలైంది కాబట్టి.. ఈ మ్యాచ్‌లో సత్తా చాటాలని అనుకుంటోంది. మరి.. ఈ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

PM Modi: కేరళ స్టోరీ వివాదం.. ఉగ్రశక్తులతో కాంగ్రెస్ ఒప్పుందం చేసుకుందన్న ప్రధాని

ప్రస్తుతం ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో టాప్-4లో ఉన్నాయి. జీటీ అగ్రస్థానంలో ఉండగా, ఆర్ఆర్ నాలుగో స్థానంలో ఉంది. ఈ రెండు జట్లు ఈ సీజన్‌లో మెరుగ్గానే రాణిస్తున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతమైన సత్తా చాటుతున్నాయి. బ్యాటర్లలో ఇరు జట్లలో ఏడు వికెట్ల దాకా మంచి బ్యాటర్లు ఉన్నాయి. విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగల స్టార్ బ్యాటర్లూ ఉన్నారు. అలాగే.. కట్టుదిట్టమైన బౌలింగ్ వేసి, ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేసే సామర్థ్యం ఉన్న బౌలర్లూ ఉన్నారు. అందుకే.. ఈ ఇరుజట్ల మధ్య తాజా పోరు ఆసక్తికరంగా మారింది. రెండు పటిష్టమైన జట్లే కాబట్టి.. ఎవరు గెలుస్తారన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. చూద్దాం.. మరికొన్ని గంటల్లోనే ఫలితాలు తేలిపోతాయిగా!

Mallikarjuna Kharge: కర్ణాటకలో కాంగ్రెస్ ఓడిపోతే.. నాదే పూర్తి నైతిక బాధ్యత

Show comments