Site icon NTV Telugu

IPL 2023 : రాజస్థాన్ రాయల్స్ తో గుజరాత్ టైటాన్స్ ఢీ..

Gt Vs Rr

Gt Vs Rr

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో భాగంగా ఇవాళ జైపూర్ వేదికగా జరగనున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన రాజస్థాన్ గత నెలలో మొదటి తొలి మ్యాచ్ లో తలపడినప్పుడు గుజరాత్ పై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న టైటాన్స్ ఈ సీజన్‌లో మెరుగైన ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో నిలవగా.. రాజస్థాన్ రాయల్స్ నాల్గవ స్థానంలో ఉంది.

Also Read : Kaviya Maran : సన్ రైజర్స్ హైదరాబాద్.. కనీసం కావ్య పాప కోసమైనా గెలవండి..

ఈ సారి గుజరాత్ టైటాన్స్ పై సంజూ శాంసన్ సేన విజయం సాధించాలనే కసితో ఉంది. ఎలాగైనా ఈ మ్యాచ్ గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని రాజస్థాన్ రాయల్స్ జట్టు చూస్తుంది. ఇక ఆర్ ఆర్ జట్టులో అద్భుతమైన బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా అత్యుత్తమ బౌలింగ్ విభాగంతో పటిష్టంగా ఉంది. రాజస్థాన్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ మరోసారి రెచ్చిపోతే గుజరాత్ టైటాన్స్ జట్టుకు భారీ టార్గెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సీజన్ లో ఇప్పటి వరకు యశస్వి జైస్వాల్ మూడు హాఫ్ సెంచరీలు ఒక సెంచరీతో చెలరేగిపోయాడు. అతని స్ట్రైక్ రేట్ 159.70గా ఉండి. ఇక సంజూ శాంసన్, షిమ్రాన్ హెట్మెయర్ మంచి ఆరంభాలను నిర్మించడానికి ఉన్నారు.

Also Read : Jammu Kashmir: వరసగా మూడో రోజు కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల కోసం వేట..

రాజస్థాన్ రాయల్స్ జట్టులో ప్రపంచ స్థాయి స్పిన్నర్లను కలిగి ఉంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ సమతూకంతో కూడిన జట్టును కలిగి ఉంది. అయితే తమ ఓపెనర్లు మెరుగ్గా రాణించాలనుకుంటారు. శుభ్‌మాన్ గిల్ ఇప్పటికే మూడు అర్ధ సెంచరీలు కొట్టి బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ, తొమ్మిది గేమ్‌లలో 16.77 సగటుతో ఉన్న అతని ఓపెనింగ్ భాగస్వామి వృద్ధిమాన్ సాహా గురించి కూడా చెప్పలేము. అతను ఎప్పుడు ఎలా ఆడతాడో అర్థం కానీ పరిస్థితి ఏర్పాడింది. ఇక ఆ మ్యాచ్‌లలో హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్ అత్యుత్తమ ప్రదర్శనకారులుగా ఎదిగారు.ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి వీరిద్దరిపైనే ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లలో గుజరాత్ టైటాన్స్ 3-1 తేడాతో హెడ్-టు-హెడ్ రికార్డును సాధించింది. GT IPL 2022లో RRని మూడుసార్లు ఓడించింది, అయితే డిఫెండింగ్ ఛాంపియన్లు తమ మునుపటి లీగ్ స్టేజ్ మ్యాచ్‌లో రాయల్స్‌తో ఓడిపోయారు.

Exit mobile version