Site icon NTV Telugu

Johannesburg: రెండో టెస్టుకు వరుణుడి ఆటంకం.. నాలుగోరోజు ఆట ఆలస్యం

జోహన్నెస్ బర్గ్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. వర్షం కారణంగా నాలుగో రోజు ఆట ప్రారంభం కాలేదు. ఉదయం నుంచి వర్షం పడుతుండటంతో పిచ్ మొత్తాన్ని అంపైర్లు కవర్లతో కప్పి ఉంచారు. ఇరుజట్లకు నాలుగోరోజు కీలకంగా మారింది. భారత్ విజయం సాధించాలంటే 8 వికెట్లు తీయాల్సి ఉండగా… దక్షిణాఫ్రికా విజయం సాధించాలంటే 122 పరుగులు చేయాల్సి ఉంది.

Read Also: 30 ఏళ్లకే క్రికెటర్ రిటైర్మెంట్.. బోర్డు నిర్ణయమే కారణమా?

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు ఆలౌట్ కాగా.. దక్షిణాఫ్రికా ధీటుగా స్పందించి 229 పరుగులు చేసింది. దీంతో 27 పరుగుల ఆధిక్యం లభించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో పుజారా, రహానె హాఫ్ సెంచరీలు సాధించడంతో టీమిండియా 266 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం తీసేస్తే దక్షిణాఫ్రికా ముందు 240 పరుగుల విజయలక్ష్యం నిలిచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి ప్రొటీస్ జట్టు 118 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే భారత బౌలర్లు విజృంభించాల్సి ఉంది. బౌన్స్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై బుమ్రా, షమీ రాణించాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.

Exit mobile version